Samantha: సమంత తమిళ అమ్మాయి అయిన కూడా తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన ఈ తమిళ పొన్ను సమంత.. ఆ తర్వాత ఆ సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏడేళ్లు ప్రేమించుకున్న వీరు 2017, అక్టోబర్ 7న వివాహ బంధంతో ఒకటి కాగా, నాలుగేళ్లకు అంటే అక్టోబర్ 2, 2021న విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఈ ఇద్దరి గురించి ఏదో ఒక ప్రచారం హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే వీరు విడిపోయిన విషయంపై ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకపోయిన ఎవరికి నచ్చినట్టు వారు కథలు అల్లేస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత అప్పుడప్పుడు ఏవో పోస్ట్‌లు పెడుతూ అనేక అనుమానాలు రేకెత్తిస్తుంటుంది.
ఇటీవల సమంత.. యశోద, శాకుంతలం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యశోద పర్వాలేదు అనిపించిన శాకుంతలం నిరాశపరచింది. ఇక త్వరలో ఖుషీ సినిమాతో పలకరించబోతుంది. సమంత-విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నరు. సినిమా రిలీజ్‌కి నెల పైనే ఉన్నా అప్పుడే ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ సందర్భంగా విజయ్, సమంత తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమకు ఇష్టమైన గేమ్స్, ప్లేయర్స్, వాళ్ళ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్స్… ఇలా అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు.కాగా సమంత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పట్ల అభిమానం చాటుకుంటూ, తనే నాకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు.
ఒక దశలో విరాట్ ఫార్మ్ కోల్పోయి ఎన్నో ఇబ్బందులతో పాటు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయనపై ముప్పేట దాడి జరిగిన నిశ్శబ్ధంగా ఉన్నారు. అయితే ఒక భారీ సెంచరీ చేసి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ చారిత్రాత్మక 71వ సెంచరీ నాకు కూడా ఎంతో స్పెషల్. ఆ రోజు అయితే నేను ఏడ్చేశాను, అని సమంత చెప్పుకొచ్చింది. అలాగే ధోని అంటే కూడా తనకు ఇష్టమని చెప్పుకొచ్చిన సమంత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ఫేవరెట్ అన్నారు. కాగా, సమంత రీసెంట్గా నటించిన శాకుంతలం దారుణంగా నిరాశపరచింది.మంచి అంచనాల నడుమ సుమారు 60కోట్లతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబట్టలేకపోయింది. విడుదలైన తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది అని చెప్పాలి.. ఇక ఇప్పుడీ సినిమా ప్రముఖ ఓటీటీలో అందుబాటులో ఉంది.. ఈనెల 12న శాకుంతలం సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతుంది