Bad cholesterol: మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతూ ఉంటుంది. అది మన ఆరోగ్యానికి చాలా హానికరం. అధిక కొవ్వు అంటే రక్తంలో కొవ్వులు ఎక్కువగా పేరుకుపోవడమే. ఇలా బ్లడ్‌లో కొవ్వులు పేరుకుపోవడంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
అధిక కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్‌గా భావిస్తారు. ఎందుకంటే ఇవి మరణ ప్రమాదాన్ని పెంచుతాయి. మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ LDL, మంచి కొలెస్ట్రాల్ HDL. ఈ రెండూ లిమిట్‌కు మించి పేరుకుపోవడం హానికరం.
కొన్ని రకాల టీలు తాడం వల్ల కొలెస్ట్రాల్ కరిగించేయవచ్చు. గ్రీన్ టీ తాగడం వల్ల ఇందులో ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందు వరుసలో ఉంటుంది. గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి దోహదపడుతుంది.
మరో టీ మందార టీ. దీన్ని హిబిస్కస్ టీ అని పిలుస్తారు. ఇది మధుమేహ రోగుల్లో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుంది. రోజూ పరగడుపున మందార పూలతో టీ కాచుకొని తాగితే బెటర్.
ఇక యెర్బామేట్ ద్వారా కూడా కొవ్వును కరిగించవచ్చు. ఇది ఒక మొక్క. ఔషధా గుణాలతో నిండి ఉంటుంది. ఈ మొక్క ఆకులతో టీ మరిగించి తయారు చేసుకోవాలి. అది అద్భుతంగా పనిచేస్తుంది. కొవ్వును కరిగించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
Read Also : Honey Rose: యువతకి ఊపిరాడనివ్వకుండా చేస్తున్న హనీరోజ్.. ఇలా అయితే కుర్రకారు ఏమై పోవాలి..!