HomecinemaNaga Chaitanya: చైతన్య‌తో డేటింగ్ రూమ‌ర్స్‌పై ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన శోభిత‌

Naga Chaitanya: చైతన్య‌తో డేటింగ్ రూమ‌ర్స్‌పై ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన శోభిత‌

Telugu Flash News

Naga Chaitanya: కొద్దిరోజులుగా నాగచైతన్య – శోభితా ధూళిపాళ డేటింగ్ లో ఉన్నారంటూ తెగ ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. స‌మంత నుండి విడిపోయిన చైతూ ప్ర‌స్తుతం శోభిత‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని త్వ‌ర‌లో వీరిద్ద‌రు వివాహం చేసుకోబోతున్నార‌నే టాక్ న‌డిచింది. దానికి సాక్ష్యంగా లండన్ లో వీరిద్దరూ షికారు చేసిన ఫొటోలను, అంతకు ముందు ఎఫ్1 రేస్ లో కలిసి దిగిన పిక్స్ షేర్ చేశారు నెటిజ‌న్స్. అయితే వాట‌న్నింటికి తాజా ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది శోభిత‌.

నాపై రూమర్స్ ఎక్కువగా రాలేదనే భావిస్తున్నాను. ఎవరో ఒకరు తెలిసీ తెలియక మాట్లాడిన వాటిని పెద్దగా ప‌ట్టించుకోను. నేను ఏం చేయ‌కుండా వచ్చిన వార్తలకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవితంతో ముందుకు సాగి తీరాల్సిందే. అనవసరమైన వాటిపై పెద్ద‌గా ఆలోచించాల్సిన పన్లేదు అని శోభిత స్ప‌ష్టం చేసింది. ఇక అటు నాగచైతన్య కూడా డేటింగ్ కస్ట‌డీ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఈ రూమర్లను ఖండించిన విషయం తెలిసిందే. కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ‘జనాలు రూమర్లనే నమ్మడం బాధాకరమన్నారు అని చెప్పుకొచ్చాడు. కాగా, శోభిత ప్ర‌స్తుతం ‘సితారా’, ‘మంకీ మ్యాన్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News