HomecinemaVirupaksha: న‌వ్య‌స్వామితో రిలేష‌న్‌పై స్పందించిన విరూపాక్ష న‌టుడు..!

Virupaksha: న‌వ్య‌స్వామితో రిలేష‌న్‌పై స్పందించిన విరూపాక్ష న‌టుడు..!

Telugu Flash News

Virupaksha: వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పై కూడా న‌డిచే ప్రేమాయ‌ణాలు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. సుడిగాలి సుధీర్, రష్మీ.. దీప్తి సునైనా, షణ్ముఖ్ లాంటి సెలెబ్రిటీల మధ్య ప్రేమ వార్తలు ఎంత హాట టాపిక్ అయ్యాయో మ‌నం చూశాం. ఇక కొంత కాలంగా బిగ్ బాస్ రవికృష్ణ, నటి నవ్య మ‌ధ్య రిలేష‌న్ షిప్ న‌డుస్తుంద‌ని త్వ‌ర‌లో వీరిరివ‌రు పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌నే ప్ర‌చారాలు వ‌స్తున్నా కూడా వీరు ఏ నాడు స్పందించ‌లేదు.

విరూపాక్ష సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రవికృష్ణ తాజా ఇంటర్వ్యూలో నవ్య స్వామితో రిలేషన్ గురించి తొలిసారి ఓపెన్ అయ్యాడు. ఒక సూపర్ హిట్ సీరియల్ లో కలసి నటించిన తర్వాత అలాంటి రూమర్స్ రావ‌డం కామ‌న్. అయితే నవ్య ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ కాగా, మా ఇద్దరి మధ్య ఇంతవరకు ప్రేమ పెళ్లి అనే ఆలోచన రాలేదు అని ర‌వికృష్ణ అన్నాడు. భవిష్యత్తులో నవ్య వైపు నుంచి ప్రపోజల్ వస్తే ఆలోచిస్తా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు రవికృష్ణ స్ట‌న్నింగ్ స‌మాధానం ఇచ్చాడు. ఆయ‌న మాట‌ల‌ని బ‌ట్టి నవ్య స్వామి త‌న మ‌న‌సులో ఉన్నట్లే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News