Anasuya: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ వీలు చిక్కినప్పుడల్లా తన అందచందాలతో నెటిజన్స్ కి పసందైన వినోదం పంచుతూ ఉంటుంది. అయితే ఇటీవల వీలు చిక్కినప్పుడల్లా అనసూయ.. విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్గా ఖుషీ పోస్టర్ మీద విజయ్ పేరు.. ది విజయ్ దేవరకొండ అని ఉండడంతో సెటైరికల్‌గా కామెంట్ చేసింది.
అయితే విజయ్‌కి, అనసూయకి ఎక్కడ చెడిందనే విషయంపై ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. కొన్ని నెలల క్రితం ఓ సినిమా ఫంక్షన్లో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్.. విజయ్ దేవరకొండతో గొడవ పెట్టుకున్నారని తెలుస్తుండగా, ఆ సమయంలో తన సినిమా గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విజయ్ మండిపడ్డాడట. తన భర్తతో విజయ్ అంతలా గొడవ పెట్టుకోవటంతో అనసూయకి కోపం పెరిగి వీలు చిక్కినప్పుడల్లా అతడిని టార్గెట్ చేసి కామెంట్లు చేస్తోందని ఓ చర్చ బాగా నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.