Samantha: ఏ మాయ చేశావే సినిమాలో కలిసి నటించిన నాగ చైతన్య, సమంత 2017, అక్టోబర్ 7న వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి అన్యోన్యత చూసి ప్రతి ఒక్కరు ఎంతో మురిసిపోయారు. అయితే ఏమైందో ఏమో కాని ఆకస్మాత్తుగా 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకొని షాక్ ఇచ్చారు. ఇక అప్పటి నుండి వారికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల నాగ చైతన్య.. సమంత గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా లవ్లీ పర్సన్.. తను ఎప్పటికి సంతోషంగా ఉండాలి సోషల్ మీడియా వల్ల వచ్చిన కొన్ని వదంతుల వల్లే మా బంధానికి ఇబ్బందులు వచ్చాయన్నట్టు చెప్పాడు.
చైతన్య కామెంట్స్ వైరలవుతోన్న వేళ.. సమంత చేసిన తాజా పోస్ట్ లేని అనుమానాలు రేకెత్తిస్తుంది. ఆ పోస్ట్ నాగ చైతన్య వ్యాఖ్యలకు కౌంటర్‌గా చేసినట్లే ఉంది కొందరు నెటిజన్స్ అంటున్నారు. సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో..మనమంతా ఒక్కటే.. కేవలం ఈగోలు, భయాలు, నమ్మకాలు మాత్రమే మనల్ని దూరం చేశాయి అంటూ పోస్ట్ చేయగా, ఇది అందరిలో అనేక ఆలోచనలు కలిగిస్తుంది. దీనికి కౌంటర్‌గా చైతూ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.