Ileana: టాలీవుడ్లో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన అందాల భామ ఇలియానా. గోవా బ్యూటీ తన అందచందాలతో కుర్రకారుని ఎంతలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడికి ప్రస్తుతం సినిమాలు పెద్దగా లేవు. మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్లు వంటివి చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఇక ఏప్రిల్ 18న ఈ బ్యూటీ పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఆమె గర్భం దాల్చినట్లు నేరుగా ప్రకటిస్తూ.. ‘నా బుజ్జాయి కోసం ఎదురుచూస్తున్నా’ అని కామెంట్ పెట్టింది.
ఇక తాజాగా ఆమె బేబీ బంప్ రివీల్ చేస్తూ… తన గర్భాన్ని చూపిస్తూ చిన్న వీడియో విడుదల చేసింది. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన వీడియో చూసి అందరు షాకయ్యారు. ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి ఇలియానా ఇలా బేబీ బంప్ చూపించడంతో ఇలియానాను తల్లిని చేసింది ఎవరనే ఆతృత అందరిలో ఉంది. కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ లారెన్ట్ మైఖేల్ తో ఇలియానా ఇటీవల చాలా సన్నిహితంగా మెలుగుతుంది. అతడే ఇలియానా కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి అనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంపై ఇలియానా ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.
Aww! Ileana D’Cruz flaunts her baby bump for the first time since her pregnancy announcement❤️@IleanaOffl #ileanadcruz #bollywood #etimes pic.twitter.com/Ml9KIbrOas
— ETimes (@etimes) May 4, 2023
also read :
Ileana: పెద్ద షాక్ ఇచ్చిన ఇలియానా.. పెళ్లి కాకుండానే తల్లి అవుతుందా?