HomecinemaBhola Shankar: భోళా శంక‌ర్ నుండి చిరు లుక్ అవుట్‌.. ట్యాక్సీ డ్రైవ‌ర్‌గా అద‌ర‌గొట్టాడు..!

Bhola Shankar: భోళా శంక‌ర్ నుండి చిరు లుక్ అవుట్‌.. ట్యాక్సీ డ్రైవ‌ర్‌గా అద‌ర‌గొట్టాడు..!

Telugu Flash News

Bhola Shankar: వాల్తేరు వీర‌య్య వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత చిరంజీవి న‌టిస్తున్న చిత్రం భోళా శంక‌ర్. ఈ సినిమా ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానుండ‌గా, ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ రోజు మేడే సందర్భంగా `భోళాశంకర్‌` నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేయ‌గా, ఇందులో చిరంజీవి టాక్సీ కారు వద్ద స్టయిల్‌గా నిలబడి మాస్‌ లుక్‌లో అద‌ర‌గొడుతున్నాడు. బ్లూకల‌ర్ ష‌ర్ట్ ప్యాంట్ ధ‌రించి కార్మికుడి తరహా గెటప్ అదిరిపోయింది.

bholashankarఇక చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిగా న‌టిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. అందకు కార‌ణం ఇటీవలే హైదరాబాద్ లోని నారాయణగూడ లో ఉన్న‌ శాంతి థియేటర్ లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కి సంబంధించిన కటౌట్ మరియు బ్యానర్స్ భారీగా ఏర్పాటు చేశారు. భోళా శంక‌ర్ షూటింగ్ కోస‌మే ఇలా చేశార‌ని ఫిలిం న‌గ‌ర్ టాక్. చిత్రంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమాని గా నటిస్తున్న సందర్భంగా , ఆయనకీ సంబంధించి థియేటర్ లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని వార్త‌లు వినిపిస్తున్నాయి.

also read :

Protein foods : ప్రొటీన్‌ పొందాలంటే గుడ్లే కాదు.. ఇవి కూడా తినొచ్చు!

Balagam: తెలంగాణ కానిస్టేబుల్ ప‌రీక్ష‌లో బ‌ల‌గం సినిమాపై ప్ర‌శ్న‌.. ఏం అడిగారంటే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News