ఉత్తరాదిన బాలీవుడ్ ఇండస్ట్రి లో బాయ్‌కాట్ ట్రెండ్ కొనసాగుతోంది . బాలీవుడ్ తారలు, బాలీవుడ్ సినిమాలను వరుసగా నెటిజన్లు బహిష్కరిస్తున్నారు. ఇటీవల అమీర్ ఖాన్ సినిమా ‘లాల్‌సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ మరియు తాప్సీ ‘దొబారా’ చిత్రాలు బహిష్కరించబడ్డాయి.
గత గురువారం (ఆగస్టు 25) విడుదలైన ‘లైగర్’ని బహిష్కరించాలని #BoycottLiger అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలన్నీ ఏదో ఒక విధంగా బహిష్కరించబడుతున్నాయి.
ఈ బాయ్ క్యాట్ వివాదంపై ఇప్పటికే పలువురు హీరోలు స్పందించారు. తాజాగా ఈ బాయ్‌కాట్ వివాదంపై తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా స్పందించారు. విక్రమ్ తాజా చిత్రం కోబ్రా ఆగస్ట్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా హీరో విక్రమ్ మీడియాతో ముచ్చటించారు.
ఇటీవల నెటిజన్లు చాలా బాలీవుడ్ చిత్రాలను బాయ్‌కాట్ సినిమాలు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. విక్రమ్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
అసల్ బాయ్‌కాట్ అంటే ఏమిటి? బాయ్ అంటే నాకు తెలుసు..గర్ల్ అంటే నాకు బాగా తెలుసు.. చివరికి కాట్ అంటే నాకు తెలుసు కానీ.. బాయ్‌కాట్ అనే పదం నాకు తెలియదు’ అన్నాడు విక్రమ్.
కోబ్రా విషయానికి వస్తే, ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు మరియు సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ నటి శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా విడుదల చేయనుంది.
లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ ఏం చేస్తున్నాడు ?
నిఖిల్ ఇంటర్వ్యూ : నాకు గాడ్ ఫాదర్ ఎవ్వరూ లేరు..అందుకే..