Homecinema'Ponniyin Selvan 2' Review :'పొన్నియన్ సెల్వన్ 2' తెలుగు మూవీ రివ్యూ

‘Ponniyin Selvan 2′ Review :’పొన్నియన్ సెల్వన్ 2’ తెలుగు మూవీ రివ్యూ

Telugu Flash News

‘Ponniyin Selvan 2’ Review: మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం త‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి విజయాన్ని అందుకోగా, ఈ రోజు రెండో పార్ట్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ట్రైల‌ర్ సాంగ్స్‌తో భారీ అంచ‌నాలని ఈ చిత్రం అందుకుంది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుద‌ల చేశారు. మ‌రి ఈ చిత్రం క‌థ ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌:

రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు చోళనాడు యువరాజు అరుణ్మోజి వర్మన్ ని చంపాలని చూస్తాడు. యువరాజును కాపాడే బాధ్యత వల్లవరాయన్(కార్తీ) తీసుకుంటారు. సముద్రంలో ప్రత్యర్ధులతో జరిగిన యుద్ధంలో అరుణ్మోజి( జయం రవి) మరణించాడని అంద‌రు అనుకుంటారు. అప్పుడు అరుణ్మోజి మరణానికి ప్రతీకారంగా ఆదిత్య కరికాలన్(విక్రమ్) ఏం చేశాడు? అసలు చోళులపై నందిని(ఐశ్వర్య రాయ్) పగ ఎందుకు పెంచుకున్నారు? ఆదిత్య కరికాలుడిని చంపి, చోళనాడును ఆమె ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది? అనేది చిత్రం చూస్తే తెలుస్తుంది.

ప‌ర్‌ఫార్మెన్స్:

Ponniyin Selvan 2పార్ట్ 2లో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శోబితా దూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. ప్ర‌తి ఒక్క‌రు కూడా వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఏ పాత్ర కూడా నిరాశ‌ప‌ర‌చే విధంగా ఉండ‌దు. నందిని (ఐశ్వర్య రాయ్)- కరికాలన్ (విక్రమ్) ఎదురుపడే సీన్ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. ఎప్ప‌టిలానే చియాన్ విక్రమ్ అయితే తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. కార్తీ, ఐశ్వర్య రాయ్ కూడా అదరహొ అనిపించారు. ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ప్ర‌తి ఫ్రేముని చాలా అందంగా తీసాడు. అన్నింటికంటే ఏఆర్ రెహ్మాన్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ చాలా బాగుంది. సినిమాలో ఎక్కువగా హై పాయింట్స్ లేకపోయినా ఎంగేజింగ్‌గా ఉంది. ర‌వివర్మ సినిమాటోగ్రఫీ , సీజీ వర్క్, విజువల్స్, స్క్రీన్ ప్లే అద్భుతం.

ప్ల‌స్ పాయింట్స్:

న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్
రెహ‌మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ద‌ర్శ‌క‌త్వం

మైన‌స్ పాయింట్స్ :

ఎడిటింగ్

ఫైన‌ల్‌గా..

పార్ట్ 1 అరుళ్మోజి, వల్లవరాయన్ ప్రమాదంలో ఉన్నట్లు ముగించ‌గా, ఇప్పుడు వారిని కాపాడేందుకు ఓ మహిళ వచ్చినట్లు చూపించారు. చోళ నాడు మాత్రం అరుళ్మోజి చనిపోయినట్లు భావిస్తుంది. యువరాజు మరణించిన నేపథ్యంలో రాజ్యంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు పొన్నియిన్ సెల్వన్ 2 లో చూపించారు. పార్ట్ 1లో స్లోగా వెళ్లిన కథ రెండో భాగంలో మాత్రం పుంజుకుంది. అయితే ఇంకాస్తా ట్రిమ్ చేస్తే బాగుండేది. సెకండ్ పార్ట్‌లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. త‌మిళ ఆడియ‌న్స్ ఈ సినిమాకి ఫిదా అవుతున్నారు. మిగతా భాషల ఆడియన్స్ ని ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

-Advertisement-

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

also read :

Agent Telugu Movie Review : ‘ఏజెంట్’ తెలుగు మూవీ రివ్యూ

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News