Agent Telugu Movie Review: వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అఖిల్ తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాని ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా.. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు. చిత్రంలో కథానాయికగా కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం కోసం సరికొత్తగా మేకోవర్ అయిన అఖిల్.. స్టైలిష్ లుక్‌లో కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ లుక్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా కథ ఎలా ఉందో చూద్దాం.
కథ:
రా ఏజెన్సీ ప్రధానంగా సాగే సినిమాగా చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. రా ఆఫీసర్ అయిన మమ్ముట్టి ఓ మాఫియా ముఠాని పట్టుకోవడంలో విఫలం అవుతుంటాడు. ఇక అప్పుడు వాళ్లని పట్టుకోవడానికి కొంటె ప్రవర్తన కలిగిన వ్యక్తి( అఖిల్) అయితే బెటర్ అని, అలాంటి వాడే ఇలాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్ ని పట్టుకోగలరని భావిస్తాడు. దాంతో ఆ ఆపరేషన్ ఏజెంట్‌ని అఖిల్‌కి అప్పగిస్తారు. దీంతో అఖిల్ తన కొంటెతనంతో, అల్లరితో వారిని ఎలా పట్టుకున్నాడనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
పర్‌ఫార్మెన్స్:
ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని సినిమా చూస్తే తప్పక అర్ధమవుతుంది. యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టాడు. అయితే నటనలో కొద్దిగా తేలిపోయాడు. ఇక కథానాయిక సాక్షి వైద్య తన నటనతో పర్వాలేదనిపించింది. మమ్ముట్టితో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి మూవీని అందంగా మలచడంతో విఫలమయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాకి కథలో మ్యాటర్ లేదు. సోల్ పూర్తిగా మిస్ అయింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ పర్వాలేదు కాని లవ్ స్టోరీ, మ్యూజిక్, బీజీఎమ్, విలన్ రోల్ మాత్రం బిస్కెట్ అయిందనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
ఇంటర్వెల్
టెర్రీఫిక్ యాక్షన్ స్టంట్స్
మమ్ముట్టి నటన
మైనస్ పాయింట్స్:
కథ
లవ్ స్టోరీ
బీజీఎమ్
ఫైనల్‌గా:
భారీ ఖర్చుతో ఏజెంట్ సినిమాని తెరకెక్కించగా, ఈ సినిమాకు భారీ ఖర్చు చేశారని అది ప్రతి ఫ్రెములో కనిపిస్తుంది. హై వోల్టేజ్ సీన్ తో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటుంది. ఆ సమయంలో ప్రేక్షకులకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో అఖిల్‌కు ఎదురైన సవాళ్లు , ఆఇ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ బాగుంటాయి .స్పై యాక్షన్ ఫిల్మ్స్ లో ఉండవలసిన గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్ ప్రేక్షకులకి కొంత మజా ఇస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ తప్ప మిగతా అంతా బోరింగ్ గానే ఉంటుంది. అభిమానులకి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE