HomebusinessAmazon Prime : యూజర్లకు భారీ షాక్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధర 67 శాతం పెంపు!

Amazon Prime : యూజర్లకు భారీ షాక్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధర 67 శాతం పెంపు!

Telugu Flash News

Amazon Prime : అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్న వారికి షాక్‌. చార్జీలు భారీగా పెంచుతూ అమెజాన్‌ నిర్ణయం తీసుకుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను 67 శాతం మేర పెంచింది. మూడు నెలల ప్లాన్‌ను కూడా సవరణ చేసింది.

వార్షిక ప్లాన్‌లో మాత్రం అమెజాన్‌ ఎలాంటి మార్పు చేయలేదు. తక్షణమే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయని అమెజాన్‌ స్పష్టం చేసింది. ఇప్పటికే సబ్‌స్క్రైబ్‌ అయిన వారికి 2024 జనవరి 15 వరకు పాత రేట్లే వర్తిస్తాయంది.

ఏదైనా కారణంతో రెన్యువల్‌ ఫెయిల్‌ అయితే కొత్త ధరకు ప్లాన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అమెజాన్‌ తెలిపింది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ నెలవారీ చందా ఇప్పటి వరకు రూ.179 ఉంది. దీన్ని ఇప్పుడు రూ.299కు పెంచుతున్నట్లు అమెజాన్‌ తన సపోర్ట్‌ పేజీలో వెల్లడించింది.

మూడు నెలల చందా రూ.459 నుంచి రూ.599కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ రూ.1499 ఉండగా.. అందులో మాత్రం ఎలాంటి మార్పూ చేయలేదు.

మరోవైపు అమెజాన్‌ లైట్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను రూ.999కు లభిస్తోంది. ఇందులో ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌లో ఉండే అన్ని సదుపాయాలూ ఉంటాయి. క్వాలిటీ తగ్గుతుంది. యాడ్స్‌ అదనం.

ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ఫ్రీ డెలివరీ, ప్రైమ్‌ వీడియో, ప్రైమ్‌ మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌ లాంటి సదుపాయాలు అందిస్తోంది.

-Advertisement-

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News