HomedevotionalHoroscope | ఈ రోజు రాశి ఫలాలు(28-04-2023).. ఈ రాశి వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి..

Horoscope | ఈ రోజు రాశి ఫలాలు(28-04-2023).. ఈ రాశి వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి..

Telugu Flash News

Horoscope Today, 28th april 2023: Check astrological prediction for your zodiac signs

మేష రాశి

ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఖర్చులు అధికమగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వాహనాలు, గృహాలు వంటి వాటికి ధనము ఖర్చు చేస్తారు.. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి మాత్రం ఎక్కువ ఉంటుంది.

వృషభ రాశి

ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలము, వ్యాపారస్తులకు వ్యాపారమునందు లాభములు కలుగును. వాగ్వివివాదములకు దూరంగా ఉండ‌డం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్ధికపరంగా లాభము చేకూరే అవ‌కాశం ఉంది.

మిథున రాశి

ఈ రాశి వారు ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాలి. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. కుజుని ప్రభావం చేత ఒత్తిళ్ళు అధికముగా ఉంటుంది. వివాదాల‌కి కాస్త దూరంగా ఉండ‌డం మంచిది. ఆవేశ‌పూరిత నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి . కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం చాలా మంచిది.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈ పనులయందు శ్రమ మరియు చికాకులు అధికమగును. ఆర్థిక విషయాలు కొంత‌ ఇబ్బంది పెట్టును.. గొడవలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. స్త్రీలు కుటుంబవిషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వ‌హించ‌డం ఉత్త‌మం. సింహరాశి వారు చేసే ప‌నుల యందు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

-Advertisement-

horoscope today teluguకన్యా రాశి

ఈ రాశి వారికి కొంత చికాకులు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పనిని స‌కాలంలో పూర్తి చేసెదరు. ప్రయాణములు ఎక్కువ‌గా చేస్తారు.

తులా రాశి

ఈ రాశి వారికి చేసే ప్ర‌తి పని అనుకూలించును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలుగును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని ఆరాధించడం ఉత్త‌మం.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి శారీరక శ్రమ, పని ఒత్తిళ్ళు మానసిక వేదన అధికమగును. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. శని ప్రభావంచేత ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు ఉండే అవ‌కాశం ఉంది. వివాదములకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

ధనుస్సు రాశి

ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. ప్రయాణములు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండ‌డం ఉత్త‌మం. వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన సమయము. శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు దక్షిణామూర్తిని పూజిస్తే మంచి జ‌రుగుతుంది.

మకర రాశి

ఈ రాశి వారికి ప్రయాణములు అనుకూలించును. శని అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందుతారు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా చెప్పాలి.. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం తైలాభిషేకం చేస్తే మంచిది

కుంభ రాశి

ఈ రాశి వారికి శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆర్ధిక విషయాలు, ఖర్చులలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొనే అవ‌కాశం ఉంటుంది. కుటుంబ సమస్యలతో వాగ్వివిదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారస్తులకు ఖర్చులు ఎక్కువ‌గా ఉంటాయి. గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన.

మీన రాశి

ఈ రాశి వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. ఉద్యోగస్తులకు చెడు సమయముగా భావించాల్సి ఉంటుంది.. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు కష్ట సమయము. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వ‌హించ‌డం ఉత్త‌మం.

 

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News