HomecinemaAllari Naresh: బాబోయ్.. అల్ల‌రి న‌రేష్ 4 రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగాడా..!

Allari Naresh: బాబోయ్.. అల్ల‌రి న‌రేష్ 4 రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగాడా..!

Telugu Flash News

Allari Naresh: అల్లరి న‌రేష్‌..ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన న‌రేష్ ఇటీవ‌ల సీరియ‌స్ పాత్ర‌లు చేస్తున్నాడు. అల్లరిగా కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నరేష్, నాంది సినిమాతో ఒక్కసారిగా భయపెట్టేసాడు.

కామెడీతో న‌వ్వించిన నరేష్ ను అలా సీరియస్ గా చూడడంతో ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక తాజాగా ఆయ‌న ఉగ్రం అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది.

అయితే ఉగ్రం సినిమా షూటింగ్ కోసం అల్ల‌రి న‌రేష్ 4 రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగార‌ట‌. అంటే రోజుకి వంద‌కి పైగా సిగ‌రెట్స్ తాగారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

నైట్ టైమ్‌లో షూట్‌ చేసిన ఫైట్‌లో న‌రేష్ సిగ‌రెట్ కాలుస్తూ కనిపించాల్సి ఉండ‌గా, అందుకు సంబంధించిన ఫైట్‌ను నాలుగు రోజులు చిత్రీక‌రించారట.

అలా ఫైట్ పూర్త‌య్యేలోపు న‌రేష్ దాదాపు 500 సిగ‌రెట్స్ తాగేశార‌ట. ఈ విష‌యం తెలిసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. అత‌ని ఆరోగ్యం ఏమై ఉంటుంది అని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News