టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న తెలుగు క్రీడాకారుడైన అంబటి రాయుడు (Ambati Rayudu) తాజాగా వార్తల్లోకి ఎక్కాడు. ట్విట్టర్లో చేసిన ఓ రీట్వీట్ ఇందుకు కారణమైంది. మొదటి నుంచి కాస్త వివాదాల్లో చిక్కుకుంటున్న అంబటి రాయుడు.. తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని మూలపేట పోర్టుకు బుధవారం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. నౌపాడలో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించారు.
సీఎం జగన్ ప్రసంగాన్ని వైసీపీ అధికారిక పేజీ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ ట్వీట్‌ను క్రికెటర్ అంబటి రాయుడు రీట్వీట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సీఎం జగన్ ప్రసంగంపై అంబటి రాయుడు ప్రశంజల జల్లు కురిపించారు. మన సీఎం వైఎస్ జగన్ ప్రసంగం అత్యద్భుతం.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్.. అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి అంబటి రాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
Great speech ..our chief minister@ysjagan garu.. everyone in the state has complete belief and trust in you sir.. https://t.co/gw4s1ek1LR
— ATR (@RayuduAmbati) April 19, 2023
టీమిండియా క్రికెటర్లు పలువురు గతంలోనూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీగా గెలుపొందారు. అంతకుముందు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా నవజోత్ సింగ్ సిద్ధు, మనోజ్ తివారీ లాంటి వారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. పదవులను కూడా అలంకరించారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడు ఈ సీజన్ ఐపీఎల్ ముగియగానే రిటైర్మెంట్ ప్రకటించి ఏపీ రాజకీయాల్లో స్థిరపడాలని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు వైసీపీ పార్టీని ఎంచుకున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న అంబటి రాయుడును వన్డే వరల్డ్ కప్‌కు సెలెక్ట్ చేయడంలో అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. వివక్ష చూపించారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్లో అంబటి రాయుడును కాదని తమిళనాడుకు చెందిన విజయ్ శంకర్‌ను టీమ్‌లోకి కతీసుకున్నారు. దీంతో విజయ్‌శంకర్ ఆటను చూసేందుకు తాను త్రీడీ గ్లాస్‌ను కొనుక్కుంటానంటూ అంబటి రాయుడు ట్విట్టర్లో సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు కూడా ప్రకటించి ఆశ్చర్యపరిచిన అంబటి రాయుడు.. తాజాగా ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించి తర్వాత సీఎస్కే మేనేజ్మెంట్ జోక్యంతో విరమించుకున్నాడు. తాజాగా ఏపీలో అధికార పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
also read :
Chhattisgarh : ఇరవై ఏళ్ల కిందట చంపేస్తే.. కలలోకి వచ్చి టార్చర్ పెడుతున్నాడు..!
Samantha: సమంత అనారోగ్యం అంతా నాటకమా.. సినిమా కోసం అలా చేసిందా?