Sukumar: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు.. కార్తిక్ వర్మ తెరకెక్కించిన చిత్రం విరూపాక్ష. ఈ సినిమా డైరెక్టర్ కార్తిక్ వర్మ ఎలాంటి క్రిటికల్ మెడికల్ కండిషన్ నుంచి బయటపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడో సుకుమార్ చెప్పుకొచ్చాడు. కార్తిక్‌కు ఒక మెడికల్ ప్రాబ్లెమ్ ఉండేది.
తాను ఐదారేళ్లు మాత్రమే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. తను నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అని సుకుమార్ పేర్కొన్నారు. తన అమ్మదీవెనలు ఫలించి క్రమక్రమంగా ఆ సమస్య నుంచి కార్తీక్ కోలుకున్నాడు. అనారోగ్యం నుంచి బయటపడి.. ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేయడం ఆనందంగా ఉంది.
అనారోగ్యం కారణంగా కార్తిక్.. ఎప్పుడు స్టెరాయిడ్స్ మీద ఉండాల్సి వచ్చేది. అవి తీసుకోకుంటే బాడీలో ప్లేట్స్‌లెట్స్ అనేవి పెరిగేవి కావు . ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడ్డాడంటే వాళ్ల అమ్మ ఆశీస్సులే కారణం’’ అని సుకుమార్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 21న విరూపాక్ష చిత్రం విడుదల కానుండగా, ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరిన్ని చదవండి :
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. త్వరపడండి!
Arjun Tendulkar: ఎట్టకేలకు సచిన్ తనయుడి అరంగేట్రం.. బౌలింగ్‌లో ముద్ర వేస్తాడా?