HomecinemaAnanya Nagalla: న‌న్ను ఎవ్వరూ ట్రై చేయ‌లేదు.. అన‌న్య ఆస‌క్తిక‌ర కామెంట్స్

Ananya Nagalla: న‌న్ను ఎవ్వరూ ట్రై చేయ‌లేదు.. అన‌న్య ఆస‌క్తిక‌ర కామెంట్స్

Telugu Flash News

Ananya Nagalla: మల్లేశం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమై వ‌కీల్ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకుంది అన‌న్య నాగ‌ళ్ల‌. ఇక రీసెంట్‌గా సమంత హీరోయిన్‌గా వచ్చిన శాకుంతలం చిత్రంతో కూడా ప్రేక్షకులను పలకరించింది. ఇక ఇప్పటి వరకు సినిమాల్లో పెద్దగా గ్లామర్‌ పాత్రలో కనిపించని అనన్య.. సోషల్‌ మీడియాలో మాత్రం గ్లామర్‌ డోస్‌ను ఓ రేంజ్‌లో ఆర‌బోస్తుంది.

సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తూనే ఉంటుంది. తాజ‌గా అన‌న్య నాగ‌ళ్ల ‘జస్ట్ ఆస్క్‌’ అంటూ అభిమానులని తమకు నచ్చిన ప్రశ్నలు వేయ‌మ‌ని కోరింది. ఇక ఛాన్స్ దొరికింది క‌దా అని నెటిజ‌న‌స్స్ రెచ్చిపోయి విచిత్ర ప్ర‌శ్న‌లు సంధించారు. ఓ యూజర్‌ ప్రశ్నిస్తూ.. ‘నీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పు.. అతని ఐడీ ఏంటో చెప్పు’ అని అడగ‌డంతో దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది అనన్య‌.

నాకు ‘బాయ్ ఫ్రెండ్‌.. అంత సీన్ లేదు భయ్యా.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అనుకుంటున్నారేమో తెలియ‌దు కాని, ఎవ్వరూ ట్రై చేయడం లేదు. నాకు అదే సమస్య గా మారింది అంటూ ఫన్నీగా బదులిచ్చిందీ మ‌ల్లేశం బ్యూటీ.

Ananya Nagalla Latest Instagram Photos 2023 | Ananya Nagalla Hot

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News