Actress Prema: తెలుగు లో కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రంతో బాగా పాపులర్ అయిన నటి ప్రేమ. స్టార్ హీరోలతోను నటించి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. అప్పట్లో చాలా మంది ప్రేమని తెలుగు అమ్మాయిగానే అనుకున్నారు. నటి గా కొనసాగుతున్న సమయంలోనే 2006 లో ప్రముఖ బిజినెస్ మ్యాన్ జివన్ అప్పచు ని పెళ్లి చేసుకుంది హీరోయిన్ ప్రేమ. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా 2016 లో భర్త నుంచి విడాకులు తీసుకొని సోలోగా ఉంటుంది ప్రేమ.
తన పర్సనల్ లైఫ్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రేమ.. నేను ఎప్పుడు పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లోకి తీసుకు రాను.. అది నాకు నచ్చలేదు అంటే దాన్ని పూర్తిగా ఖండిస్తాను. ఇప్పుడు నా వైవిహిక జీవితంలో కూడా అదే జరిగింది.. నాకు ఉన్న ఇబ్బందులు నా కుటుంబానికి చెప్పి డైవర్స్ తీసుకున్నాను. ఇక రెండో పెళ్లిపై ఎన్నో పుకార్లు వచ్చాయి..అవి వాస్తవాలు కాదు . ప్రస్తుతం నేను బెంగుళూరులో ఒంటరిగా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. దయచేసి తప్పుడు వార్తలు నమ్మోద్దు అని ప్రేమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
also read :
Shaakuntalam movie review : ‘శాకుంతలం’ తెలుగు మూవీ రివ్యూ