Shaakuntalam movie review : యశోద తర్వాత సమంత నటించిన చిత్రం శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో నటించిన `శాకుంతలం` చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. పురాణాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలిచిందా? ప్రేమ కావ్యంగా నిలచిందా? అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ :
మహాభారతంలోని శాకుంతలం, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా శాకుంతలం రూపొందించారు. ఇందులో మేనక, విశ్వమిత్రులు ప్రేమకి చిహ్నాంగా శకుంతల పుట్టింది. మేనక దేవత కావడంతో మనిషి అయిన తన కూతురు శకుంతల(సమంత)ని భూమిపైనే పక్షులకు వదిలేసి వెళ్తుంది. ఆ పక్షుల ద్వారా ఆ చిన్నారి శకుంతల కణ్వ మహర్షి వద్దకు చేరుకుంటుంది.
అయితే ఆ చిన్నారిని చూసి ముచ్చటపడిన కణ్వ మహర్షి తన దత్త పుత్రికగా స్వీకరించి ఆమె బాగోగులు అన్ని చూసుకుంటాడు.. మహర్షి లేని సమయంలో దుష్యంత మహారాజు(దేవ్ మోహన్) ఓ సారి ఆశ్రమానికి వస్తాడు.. వేట కోసం వచ్చిన ఆయన యాగంలో ఉన్న మహర్షులకు రాక్షసుల నుంచి రక్షణగా నిలుస్తాడు. ఈ క్రమంలో ఆయన కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలని చూసి ముచ్చటపడతాడు.
అతడి వీరత్వానికి, మాటలకు శకుంతల కూడా ప్రేమలోపడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. శకుంతల- దుష్యంతుడు చివరకు ఒక్కటయ్యారా లేదా అనేది? సినిమా చూడాల్సిందే.
పర్‌ఫార్మెన్స్:
చిత్రంలో శకుంతలగా సమంత బాగా చేసింది. తన వంతుగా పాత్రని పండించే ప్రయత్నం అయితే చేసింది. కాని సమంతని ఇలాంటి పాత్రలో చూడటం కొంత కష్టమే అనిపిస్తుంది. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ తన పాత్ర న్యాయం చేశాడు.. అయితే రాజు అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఓ రేంజ్ లో ఉండాలి. కానీ అంతటి లుక్ అయితే కనిపించలేదు. కణ్వ మహర్షిగా సచిన్ ఖేడ్కర్ మంచి ప్రదర్శన ఇచ్చాడు.
దుశ్శాసన మహార్షిగా మోహన్‌బాబు కాసేపు మెరిసి మెప్పించాడు. చెలికత్తే అనసూయగా అనన్య నాగళ్ల ఆకట్టుకుంది. శకుంతలని పెంచిన అమ్మగా గౌతమి నటన బాగుంది. మేనకగా మధుబాల ఓకే అనిపించింది. భరతుడిగా అల్లు అర్హ పాత్ర మాత్రం సినిమాలో హైలైట్ అని చెప్పాలి.
టెక్నికల్ విషయానికి వస్తే ముందు గుణశేఖర్ గురించి మాట్లాడుకోవాలి.. తను అనుకున్న కథని అనుకున్నట్టు అయితే తీశారు. కానీ ఇప్పటి టెక్నాలజీ, ఆడియెన్స్ మైండ్ సెట్ ని మాత్రం అర్ధం చేసుకోలేకపోయారు. నీట్‌గా స్క్రీన్‌ప్లేని రాసుకుని దాన్ని అంతే నీట్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు కాని మిగతా విషయాలలో ఫెయిల్ అయ్యారు.
మణిశర్మ పాటలు , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఎంతో సెట్ అయింది. గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ ఇంకాస్త పని చేస్తే బాగుండేది. ఏదో ఒకటి రెండు సీన్స్ లో కాస్త 3D ఎఫెక్ట్ లా అనిపిస్తుంది కానీ సినిమా అంత అది కనిపించదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
సమంత యాక్టింగ్
గుణశేఖర్ డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
గ్రాఫిక్స్
సాంగ్స్
లాజిక్స్ మిస్
బోర్ కొట్టించే చాలా సీన్స్
విశ్లేషణ:
సినిమా మొదటి భాగం మొత్తం శకుంతల, దుష్యంతుల ప్రేమ కథతో సాగగా, ఈ ఎపిసోడ్ మొత్తం ఓ సీరియల్‌ని తలపించేలా ఉంటుంది. సీన్ బై సీన్లు వస్తుండడంతో అవి ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండవు . సెకండాఫ్‌లో భావోద్వేగాల పార్ట్ ని ఎంచుకున్నాడు డైరెక్టర్ గుణశేఖర్. భావోద్వేగాల్లోనూ పెద్దగా డ్రామా పండలేదు.
శకుంతలని రిజెక్ట్ చేసినప్పుడు ఆమె పడే సంఘర్షణలోనూ నాటకీయతని పెద్దగా పండించలేకపోయాడు దర్శకుడు. సినిమాలో కాస్త ఆడియెన్స్ గుండె బరువెక్కినట్టుగా ఉంటుంది. అల్లు అర్హ ముద్దుముద్దు మాటలు ప్రేక్షకులని అబ్బురపరుస్తాయి.దృశ్య కావ్యంగా చెప్పిన ఈ సినిమా ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది.
also read :
Samantha: సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మారతారు.. నేనంతే: సమంత
Samantha Latest beautiful Photos from Shaakuntalam movie