HomecinemaKushi : సమంత - విజయ్ చిత్రానికి 'ఖుషి' టైటిల్ వాడ‌డం వెన‌క అస‌లు కార‌ణం తెలుసా ?

Kushi : సమంత – విజయ్ చిత్రానికి ‘ఖుషి’ టైటిల్ వాడ‌డం వెన‌క అస‌లు కార‌ణం తెలుసా ?

Telugu Flash News

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan)సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఖుషీ (kushi) చిత్రం ఒక‌టి. ఈ మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిని ఎంతో అల‌రిస్తూ ఉంటుంది. అయితే ఖుషీ టైటిల్ తో సినిమా చేయాలంటే చాలా మంది మేక‌ర్స్ ఎంతో భ‌య‌ప‌డ్డారు.

కాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ (vijay deverakonda) – సమంత (samantha) కలయికలో శివ నిర్వాణ (shiva nirvana) ప్ర‌స్తుతం ఖుషీ అనే సినిమా చేస్తుండగా ఈ సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఈ చిత్రానికి ‘ఖుషి’ పేరు పెట్టడానికి గల కారణాన్ని దర్శకుడు శివ నిర్వాణ స్ప‌ష్టం చేశారు.. ‘ఈ సినిమా కథ రాయగానే హీరోయిన్ పాత్రకు సమంతనే న్యాయం చేయగలదని అనిపించింద‌ని, విజయ్, సమంత కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Samantha :కూతురి కెరీర్ గురించి బ‌న్నీ ప‌ట్టించుకోడంటూ స‌మంత స్టన్నింగ్ కామెంట్స్

గతంలో పవన్ ‘ఖుషి’ ఫీల్‌గుడ్ మూవీలో ఎంత ఫీల్ అయితే ఉందో ఈ మూవీలో కూడా అంతే ఫీల్ ఉంటుంది. అందుకే ఈ సినిమాకి ‘ఖుషి’ పేరే పెట్టాం’ అని చెప్పారు. ఇక ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తుండ‌గా, మూవీ ప్రేక్షకుల‌కి మంచి వినోదం పంచ‌నుంద‌ని అర్ధం అవుతుంది. శివ నిర్వాణ గ‌త చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి ప్రేక్ష‌కుల‌ని ఎంతో హ‌త్తుకున్న విష‌యం తెలిసిందే.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News