HomecinemaRenu desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌పై మ‌రోసారి ఫైర్ అయిన రేణూ దేశాయ్

Renu desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌పై మ‌రోసారి ఫైర్ అయిన రేణూ దేశాయ్

Telugu Flash News

Renu desai :ప్ర‌ముఖ సినీ న‌టి రేణూ దేశాయ్.. కొన్నేళ్ల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే విడాకుల త‌ర్వాత ప‌వన్ ఫ్యాన్స్ నుండి ఆమెకు అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. అనేక సార్లు హెచ్చ‌రించిన కూడా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆమెని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఏప్రిల్ 8న పవన్ కల్యాణ్‌– రేణూ దేశాయ్ కుమారుడు అఖిరా నందన్ పుట్టినరోజు కాగా, ఆ రోజు ఓ అభిమాని అడిగిన ప్రశ్న రేణూ దేశాయ్ ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది.

Pawan Kalyan: ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా కుమారుడు మార్క్ శంక‌ర్

మేడమ్ ఇది నిజంగా చాలా అన్యాయం, మా అన్న కొడుకుని మాకు చూడాలని ఉంటుంది క‌దా, అప్పుడ‌ప్పుడు అయిన వీడియాస్‌లో అఖీరా బాబుని చూపించండి, ద‌య‌చేసి హైడ్ చేయ‌కండి అంటూ పవన్ అభిమాని రాసుకొచ్చాడు. ఈ విషయంపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అఖిరా నా అబ్బాయి, మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనే విషయాన్ని నేను అర్థం చేసుకుంటాను, కానీ, కొంచం మాట్లాడే పద్ధతి నేర్చుకుంటే బాగుంటుంది. సాధ్యమైనంత వరకు ఇలాంటి మెసేజెస్ ప‌ట్టించుకోను. కొందరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అంటూ రేణూ దేశాయ్ పవన్ అభిమానులపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News