సన్నీలియోన్ బాలీవుడ్లోకి అడుగుపెట్టి నేటికి పదేళ్లు. పాశ్చాత్య దేశాల్లో పోర్న్ సినిమాల్లో నటించడం మానేసిన సన్నీలియోన్ 2012లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. తాను నటించిన మొదటి సినిమా జిస్మ్ 2.
‘‘2012లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయానికి నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిని. మెరుగైన జీవితం గురించి ఆలోచించాను. ఇక్కడే ఉండడాన్ని ఇష్టపడ్డాను. ఈ ఇండస్ట్రీని ప్రేమిస్తున్నాను. ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలతో సంతోషంగా ఉన్నాను.
అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చింది. ఇది నా ఇల్లు అని నాకు తెలుసు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇండస్ట్రీని ఈ స్థాయిలో ప్రేమిస్తానని అనుకోలేదు. నన్ను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు.
నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే చాలా మంది నాతో కలిసి పనిచేయడానికి సంశయించారు. కానీ, అదే సమయంలో చాలా మంది నాతో నటించేందుకు ఆసక్తి చూపారు. అలాగే పేరున్న నిర్మాణ సంస్థలు, వ్యక్తులు ఇప్పటికీ నాతో పనిచేయడానికి ఇష్టపడరు. కానీ ఇవేమీ నన్ను బాధించవు. ఏదో ఒక రోజు వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నా’’ అని 41 ఏళ్ల సన్నీ లియోన్ తన మనసులోని మాటను బయటపెట్టింది.
మరిన్ని వార్తలు చదవండి
కార్తికేయ 2 సూపర్ నేచురల్ థ్రిల్లర్.. మూవీ రివ్యూ
రజనీకాంత్ సరసన తమన్నా.. ఛాన్స్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ