CCL 2023 : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 ఛాంపియన్షిప్ గత కొద్ది రోజులుగా ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఫినాలే మ్యాచ్ వైజాగ్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరగగా, ఇందులో భోజ్‌పురి దబాంగ్ పై తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి కప్ అందుకుంది.. ఈ విజయంతో తెలుగు వారియర్స్ నాల్గవసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ అఖిల్ అక్కినేని బ్యాట్‌తో అద్భుతమైన అర్ధశతకం బాదడంతో మ్యాచ్ సునాయాసంగా గెలిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో .. తొలుత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ బౌలింగ్ చేయగా, బ్యాటింగ్‌కు వచ్చిన భోజ్‌పురి 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన తెలుగు వారియర్స్ 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌కు వెళ్లిన భోజ్‌పురి దబాంగ్స్ టీం 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేసింది. ఇక అనంతరం .. 58 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా తెలుగు వారియర్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి.. లక్ష్యాన్ని సునాయాసంగా సాధించింది. దీంతో సీసీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగు టైటిల్స్ కైవసం చేసుకున్న టీమ్‌గా తెలుగు వారియర్స్ చరిత్ర సాధించింది.
#TeluguWarriors the Champions of #CCL2023 🔥
Congratulations @AkhilAkkineni8 for phenomenal achievement bringing trophy to home 🏆
Now It’s time for the Wild Ride #Agent 💥💥 pic.twitter.com/fRDiDAGB2C
— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) March 25, 2023