Lemon : ఎండా కాలంలో దాహార్తిని తీర్చుకొనేందుకు ప్రజలు చల్లని నీటిని తాగుతుంటారు. కూల్ డ్రింక్స్, కొబ్బరినీల్లు, నిమ్మ సోడా లాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. నిమ్మకాయ సోడా తాగితే అలసట తీరి రిలాక్స్ అయిపోతుంటారు. అయితే, నిమ్మకాయ రసం రోజూ తాగరాదని నిపుణులు చెబుతున్నారు.
1. నిమ్మకాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నిమ్మరసం తాగితే వేడిని తగ్గిస్తుంది.
2. వడదెబ్బ తగలకుండా నిమ్మరసం కాపాడుతుంది. దీంతో నిమ్మరసానికి అధిక డిమాండ్ ఉంటుంది.
3. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
4. కొందరిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల కడుపులో చికాకు పెట్టేస్తుంది. జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుంది.
5. గుండెల్లో మంట, కడుపు నొప్పి, వికారం, గ్యాస్ ఉబ్బరం వంటి వాటికి దారితీస్తుంది. అధిక ఆమ్లత్వం కారణంగా నిమ్మకాయ నీరు కూడా అల్సర్లను ప్రేరేపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
6. నిమ్మకాయలోని ఎసిడిక్ కంటెంట్ కారణంగా పొట్ట, పేగు లోపలి పొరకు హాని కలిగిస్తుంది. దీని వల్ల అల్సర్ ఏర్పడుతుంది.
7. రోజూ నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ వస్తాయి. వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిమ్మరసం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
also read :
Viral Video : సింహాన్నే ఫూల్ చేశాడు.. బొమ్మలా నిలబడి ఏం చేశాడో చూడండి!
Manchu Family : రోడ్డున పడ్డ మంచు ఫ్యామిలీ గొడవ.. స్పందించిన మంచు విష్ణు