Biryani ATM : సాధారణంగా ఏటీఎం అంటే డబ్బులు విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. కొన్ని ఏటీఎంలలో నగదు డిపాజిట్ యంత్రాలు కూడా ఉంటాయి. ఈ తరహా ఏటీఎంలు అందరికీ తెలిసినవే.
1. చెన్నైకి చెందిన బాయ్ వీటూ కళ్యాణం బీవీకే బిర్యానీ పేరుతో వెండింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.
2. కొలత్తూర్ ప్రాంతంలో ఈ వెండింగ్ మెషీన్ అందుబాటులోకి తెచ్చారు. ఇండియాలోనే తొలి బిర్యానీ వెండింగ్ యంత్రం ఇదే.
3. వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ సర్వ్ చేయడం దీని ప్రత్యేకత. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది.
4. 32 ఇంచులతో ఒక యంత్రాన్ని అమర్చారు. కస్టమర్ ఆర్డర్ ఇవ్వడానికి ముందు ఇది మెనూ చూపుతుంది.
5. పేరు, ఫోన్ నంబర్ లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత QR కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించాలి.
6. ఇక్కడ మటన్ మినీ బిర్యానీ రూ.345 గా ధర నిర్ణయించారు. నగదు కట్టిన తర్వాత బిర్యానీ ప్యాక్ ఆటోమేటిక్‌గా మెషిన్ కింద ఉన్న షెల్ఫ్‌లో వచ్చేస్తుంది.
7. కౌంట్ డౌన్ పడిన తర్వాత ఇచ్చిన గడువు లోపు వేడి వేడి ఫ్రెష్ బిర్యానీ మీ ముందుకు వచ్చేస్తుంది.
8. ఈ బిర్యానీ ఏటీఎం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కొత్త ప్రయోగాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram
Also Read :
shruti haasan : నువ్వు వర్జిన్‌వేనా అంటూ శృతికి సూటి ప్రశ్న.. ఎలా స్పందించింది అంటే..!
Rana: నా కుడి కన్ను కనిపించదు అంటూ ఆశ్చర్యకర కామెంట్స్ చేసిన రానా
Naga Chaitanya: కొత్త ఇంట్లోకి ప్రవేశించిన చైతూ..
RGV: వివాదాస్పద దర్శకుడు వర్మకి ఏఆర్ రెహమాన్ శుభాకాంక్షలు.. ఎందుకో తెలుసా?