moral stories in telugu : సోమయ్య గొర్రెలు కాచుకొనే పిల్లవాడు. అతడి తండ్రి వ్యవసాయం చేసుకునేవాడు. ఒకనాడు కొడుకుని పిలిచి సోమయ్యా! ఇక్కడ చుట్టుపక్కల గడ్డి అంతా అయిపోయింది దగ్గర్లోనే అడవికి వెళ్ళి గొర్రెలను మేపుకొని రా! అక్కడ ఆకులు, అలాలు బాగా ఉంటాయి. గొర్రెల కడుపు నిండుతుంది అన్నాడు. సోమయ్య గొర్రెల మందను అడవికి మరల్చాడు.
అతనికి పనీపాట రాదు! ‘ పని లేని బుర్ర భూతాల గృహం !’ అన్నట్టుగా సోమయ్య కొక కొంటే ఆలోచన వచ్చింది. వాళ్ళ నాన్నని తోటి వ్యవసాయదారులను తన దగ్గరికి రప్పించుకోవాలనుకున్నాడు.
“ఊరుకుంటే ఊరా! పేరా! నాకు గుర్తింపు రావాలి!” అనుకొని “నాన్న పులి! నాన్న పులి!” అని గట్టిగా కేకలు పెట్టాడు. తండ్రితో సహ అందరూ కర్రలు, పలుగులు, పారలు, గొడ్డళ్ళు, గునపాలు పట్టుకొని పరుగు పరుగున వచ్చారు.
‘సోమయ్యా !ఏది పులి ! అని ఆత్రంగా అడిగారు. “హిహిహి! పులి లేదు గిలి లేదు! ఊరికినే వేళాకోళం చేశా!” అని గట్టిగా అరిచాడు. గొప్ప పని చేశావు! ఏమిటి ఈ అల్లరి అని తండ్రి మందలించాడు. అంతా పని లోకి వెళ్ళిపోయారు మళ్ళీ మర్నాడు చిలిపి అల్లరి చేయాలనిపించింది.
నాన్న పులి! నాన్నపులి అని ఇంకా గట్టిగా అరిచాడు. అందరూ వ్యవసాయ పరికరాలు పట్టుకొని పరిగెట్టుకొని వచ్చి ఏరా !సోమయ్యా ఏదీ పులి!” అని అడిగారు “ఊరికే తమాషా చేశా మీరు వస్తారో రారోనని పరీక్షించా” అన్నాడు. అందరూ తిట్టుకుంటూ వెళ్తుంటే భలేగా ఏడిపిస్తున్నాను. బాగా పరుగులు తీయిస్తున్నాను అని నవ్వుకున్నాడు.
నవ్వుల్లల్లా నువ్వులయ్యాయి ఈసారి నిజంగానే పులి వచ్చింది. గాండ్రు గాండ్రు మంటూ మంద మీద పడి రెండు గొర్రెలను చంపి నోట కరచుకొని ఈడ్చుకుంటూ పొదలమాటుకి వెళ్ళి పోయింది. సోమయ్య నిలువెల్లా వణికి పోయాడు. నోటమాట రాలేదు ఎలాగో తేరుకొని శక్తికొలది “నాన్న పులి ! నిజంగా వచ్చింది రండయ్యా! రక్షించండి ! అని అరిచాడు. వెల్లవేసుకుంటే కాకి తెల్లనవుతుందా! వాడుట్టి అబద్ధాలకోరు అని ఎవ్వరూ రాలేదు.
తరువాత జరిగింది తెలుసుకొని తండ్రి సోమయ్యను బాగా కొట్టాడు. తోటి వారంతా ‘దండం దశగుణ భవేత్’ అన్నారు. ఇంకా కొట్టు! బాగా బుద్ధి చెప్పు అన్నారు. ఇంకెప్పుడూ అబద్దం ఆడను నాన్న! అని చెంపలు వాయించుకున్నాడు సోమయ్య.
నీతి : పరాచానికికైనా అబద్ధం ఆడరాదు. ఆడితే నష్టం తప్పదు.
also read :
Roja: జీవితంలో నాకు పిల్లలు పుట్టరని చెప్పారు.. రోజా షాకింగ్ కామెంట్స్
Viral Video : మైమరచిన ప్రేమికులు.. బైకు రన్నింగ్లో ఉండగా ముద్దులు, హగ్గులు..!
Allu Arjun: అల్లు అర్జున్, సందీప్ రెడ్డి మూవీకి టైటిల్ ఫిక్స్..!