Sunday, May 19, 2024
Homeviral newsViral Video : మైమరచిన ప్రేమికులు.. బైకు రన్నింగ్‌లో ఉండగా ముద్దులు, హగ్గులు..!

Viral Video : మైమరచిన ప్రేమికులు.. బైకు రన్నింగ్‌లో ఉండగా ముద్దులు, హగ్గులు..!

Telugu Flash News

Viral Video : ప్రేమలో ఉన్నప్పుడు లోకం తెలియదంటారు. ప్రేమ గుడ్డిదని మరికొందరు చెబుతారు. అయితే, ప్రేమలో మునిగి తేలుతున్న సమయంలో లోకాన్నే మర్చిపోతారు కొందరు లవర్స్. నాలుగు గోడల మధ్య ఎంత ప్రేమించుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ రోడ్డెక్కి జనానికి కనిపించేలా పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకుంటేనే అందరూ ఇబ్బంది పడతారు.

ప్రేమికులపై కూడా పోలీసులు కేసులు గట్రా నమోదవుతాయి. అందరి ముందూ హద్దులు దాటి ప్రవర్తించడం ఈ కాలంలో పరిపాటిగా మారింది. తాజాగా హోలీ సందర్బంగా ప్రేయసితో కలిసి ప్రియుడు బైక్‌పై చేసిన రచ్చ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రేయసిని బైక్‌పై ఎదురుగా కూర్చోబెట్టుకున్న ప్రియుడు.. ఆమెకు లిప్‌లాక్‌ కిస్సులు ఇస్తూ హగ్గులు చేసుకున్నాడు. రోడ్డుపై జనాలు చూస్తున్నా వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. రాజస్తాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఓ జంట ఈ పని చేసింది. దీంతో ప్రజలు వీరిపై మండిపడుతున్నారు. జైపూర్‌లోని జవహర్‌ సర్కిల్‌ సమీపంలో బైపాస్ రోడ్డులో వాహనాలు రద్దీగా తిరుగుతుండగా మధ్యలో ఓ ప్రేమ జంట బైక్‌పై దూసుకొచ్చింది.

మామూలుగా ప్రియురాలు, ప్రియుడు కలిసి కూర్చొని బైక్‌పై వెళ్తే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ అమ్మాయి ప్రియుడికి గాఢమైన హగ్గులు కిస్సులు ఇస్తూ బైక్ పెట్రోల్‌ ట్యాంక్‌పై కూర్చుకుంది. దీంతో రోడ్డుపై అందరి దృష్టినీ ఆకర్షించింది.

-Advertisement-

దారి పొడవునా ఇదే తీరు కనిపించడంతో చూసే వారికి మరింత ఆసక్తి.. కొందరికి విరక్తి కలిగించింది. పైగా ఇద్దరూ హోలీ రంగులు పూసుకొని ఉన్నారు. హోలీ ఆటకు బదులుగా ముద్దులాట ఆడటంతో ఈ వ్యవహారాన్ని రోడ్డుపై వెళ్తున్న కొందరు వీడియో తీశారు.

దారిలో సుమారు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల దాకా ప్రియుడు, ప్రియురాలు ఇలా ముద్దులు పెట్టుకుంటూ వెళ్లారు. సమీపంలో వెళ్తున్న వాహనదారులంతా ముక్కున వేలేసుకొనేలా వీరి వ్యవహారం సాగింది. కొందరు వీరిని ఇదేం పని అంటూ మందలించే ప్రయత్నం కూడా చేశారు.

అయినప్పటికీ వీరి తీరులో మార్పు రాలేదు. చుట్టుపక్కల వారు వీడియో తీస్తున్నా పద్దతి మార్చుకోలేదు. దీంతో కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో ఆ జంటను వెతికేపనిలో పడ్డారు పోలీసులు.

Also Read :

Rakul Preet Singh bikini Photos | Travel + Leisure Photoshoot

Ashika Ranganath Latest Photos, Images, Stills 2023

Anupama Parameswaran Latest Photos, Images, stills 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News