HomecinemaManchu Manoj : శివుని ఆజ్ఞ‌తో మౌనికా రెడ్డి కొడుకు బాధ్య‌త తీసుకున్న మంచు మ‌నోజ్

Manchu Manoj : శివుని ఆజ్ఞ‌తో మౌనికా రెడ్డి కొడుకు బాధ్య‌త తీసుకున్న మంచు మ‌నోజ్

Telugu Flash News

Manchu Manoj : మంచు మోహ‌న్ బాబు వార‌సుడు మంచు మ‌నోజ్ రెండో పెళ్ల విష‌యంతో వార్త‌ల‌లోకి ఎక్కిన విష‌యం విదిత‌మే .మనోజ్ గతంలో ప్రణతిరెడ్డిని వివాహం చేసుకుని అనివార్య కార‌ణాల వ‌ల‌న 2019లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.

మౌనికారెడ్డికి సైతం 2016లో బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో పెళ్లి కాగా, ఈ దంప‌తుల‌కి ధైరవ్ రెడ్డి అనే కుమారుడు జన్మించాడు. అయితే, వారు విడిపోయిన కూడా ధైరవ్ మాత్రం తల్లి వద్దే ఉంటున్నాడు. మ‌నోజ్‌ని మౌనిక పెళ్లి చేసుకోవ‌డంతో ధైర‌వ్ ప‌రిస్థితి ఏంటా అని అంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ఈ క్ర‌మంలో మంచు మనోజ్ ఒక ఫొటోను ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో మౌనిక రెండు చేతులను తన రెండు చేతులతో పట్టుకున్నట్టు ఉండ‌గా, వాటితో పాటు మరో రెండు చేతులు ఉన్నాయి. ఈ ఫొటోకు ‘శివుని ఆజ్ఞ’ అని క్యాప్షన్ పెట్టారు మనోజ్.

అంటే, శివుని ఆజ్ఞతో మౌనికారెడ్డిని పెళ్లిచేసుకున్నట్టు చెప్ప‌గా, ఆయ‌న ఆజ్ఞ‌తోనే ధైర‌వ్ బాధ్యత కూడా తానే తీసుకున్నానని మనోజ్ ఈ ఫొటో ద్వారా చెప్ప‌క‌పే చెప్పారని అనిపిస్తోంది. కాగా, శుక్రవారం రాత్రి ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో మనోజ్-మౌనిక పెళ్లి వేడుక ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

FAQs
Q. Manchu manoj first wife name ?
A. Pranathi reddy

-Advertisement-

Q. Who is Bhuma mounika reddy first husband ?
A. Ganesh reddy

Q. Bhuma mounika reddy son name ?
A. Dhairav Reddy

Also Read : 

Manchu Manoj and Bhuma Mounika Reddy Wedding Photos

Manchu Manoj : మంచు మ‌నోజ్ పెళ్లిలో క‌నిపించిన మోహ‌న్ బాబు..అవ‌న్నీ పుకార్లేనా?

 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News