గోవా బ్యూటీ ఇలియానా (Ileana D’Cruz) దేవదాస్ సినిమాతో సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత పోకిరి, కిక్, జల్సా, జులాయి వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆమె.. బాలీవుడ్ లోనూ బర్ఫీ హిట్ కొట్టింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో నటించిన ఈ క్యూటీ ప్రస్తుతం వెండితెరపై అడపాదడపా మాత్రమే కనిపిస్తోంది. పైగా ఆమె సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తోంది. నిత్యం ఎప్పుడూ తన గ్లామరస్ మరియు ఫ్యాషన్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఈ గోవా క్యూటీ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియా చెబుతోంది.
ఇటీవల కత్రినా తన పుట్టినరోజు వేడుకల కోసం తన భర్త విక్కీ, సోదరుడు సెబాస్టియన్ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. ఈ వేడుకల్లో ఇలియానా కూడా భాగమైంది. సెబాస్టియన్‌తో కలిసి ఆడి పాడింది. దీనికి సంబంధించిన ఫోటోలను కత్రినా మరియు ఇలియానా ఇన్‌స్టా ప్లాట్‌ఫారమ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలకు ఇలియానా ‘సూర్యోదయం, కాక్‌టెయిల్స్, కొద్దిగా పుట్టినరోజు కేక్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వెంటనే, ఇలియానా కత్రినా సోదరుడితో డేటింగ్ చేస్తుందని పుకార్లు వచ్చాయి. ఎలాంటి సంబంధం లేకుండా ఈ వేడుకల్లో ఇలియానా ఎందుకు పాల్గొంటుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు గత కొంత కాలంగా సెబాస్టియన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇలియానా ఫాలో అవుతోంది. ఇదిలా ఉంటే ఇలియానా తన డేటింగ్ వ్యవహారాలతో వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. ఆమె గతంలో ఆండ్రూ అనే విదేశీ ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల 2019లో విడిపోయారు.
మరిన్ని వార్తలు చదవండి :
రకుల్ ప్రీత్ సింగ్ క్లీవేజ్ సెగలు చూడ తరమా !
#RC15: రామ్ చరణ్ జిమ్ లో కసరత్తులు..వీడియో వైరల్