Layoffs : ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీలన్నీ ప్రస్తుతం ఉద్యోగులను తొలగించేందుకు ఉపక్రమిస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్, మైక్రో సాఫ్ట్, అమెజాన్, డిస్నీ, ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా బడా కంపెనీలన్నీ వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి.
గతేడాది నుంచి మాంద్యం కారణంగా ప్రముఖ సంస్థలన్నీ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మాంద్యం భయాలు వెంటాడుతుండడంతో తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఉద్యోగులను ఇంటికి పంపాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందోనని భయపడుతున్నారు.
ఉద్యోగుల తొలగింపు సంగతి అటుంచితే ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మాంద్యం భయాలు ముంచుకొస్తున్న తరుణంలో ఎంత వీలైతే అంత ఖర్చులను తగ్గించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
కాస్ట్ కటింగ్ పేరిట ఇప్పటికే ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించిన సంగతి మరువక ముందే క్లౌడ్ ఉద్యోగులు వారి సహచర ఉగ్యోగుల డెస్క్‌లు వినియోగించుకోవాలని సూచించింది. దీంతో నిర్వహణ ఖర్చులు భారీగా మిగులుతాయని భావిస్తోంది.
రియల్ ఎస్టేట్ ఎఫిషెన్సీ పేరుతో హాలు తరహాలో డెస్కులు ఏర్పాటు చేసి గూగుల్ ఆఫీస్‌లో డెస్క్‌ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉద్యోగులు హైబ్రిడ్ వర్కింగ్ విధానంలో వారంలో 2 రోజులు ఇంట్లో, 3 రోజులు ఆఫీసులో పనిచేస్తున్నారట. వీకెండ్స్‌లో శని, ఆదివారాలు సెలవులు ఉంటున్నాయి. తాజాగా ఈ విధానంలో గూగుల్ మార్పులు చేయనుంది.
ఉద్యోగులు పరస్పర అంగీకారంతో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆఫీస్‌లో వర్క్ చేసేలా ప్రణాళిక రచించుకోవాలని స్పష్టంచేసింది. తదనుగుణంగా ఆపీసుల్లో డెస్క్‌లను సిద్ధం చేస్తున్నట్లు ఇంటర్నల్ సమావేశంలో తెలిపింది. ఇప్పుడు ఉద్యోగులకు విడివిడిగా డెస్క్‌లు లేవని, ఒకరి డెస్క్‌లు మరొకరు వాడుకోవాలని కుండబద్దలు కొట్టింది.
అయితే, డెస్క్ అందుబాటులో లేనప్పుడు ఉద్యోగులు ఆఫీస్‌కు రావచ్చని, ఆఫీస్‌లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చొని వర్క్ చేసుకోవాలంటూ సూచించింది. ఖర్చు తగ్గించుకొనేందుకు ఇంకెన్ని నిబంధనలు తీసుకొస్తారోనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
also read :
Adah Sharma Latest Hot Photos, Images, stills 2023
Mouni Roy Latest Hot Photos, Images, stills 2023