HomecinemaRakul Preet Singh : షాకిచ్చిన ర‌కుల్‌.. నవంబ‌ర్‌లోనే పెళ్లి అయిందంటూ ఆశ్చ‌ర్య‌క‌ర కామెంట్స్

Rakul Preet Singh : షాకిచ్చిన ర‌కుల్‌.. నవంబ‌ర్‌లోనే పెళ్లి అయిందంటూ ఆశ్చ‌ర్య‌క‌ర కామెంట్స్

Telugu Flash News

Rakul Preet Singh: టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ర‌కుల్ ప్రీత్ బాలీవుడ్ లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. కొంత కాలంగా మంచి స‌క్సెస్ లేక చాలా ఇబ్బందులు ప‌డుతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్త‌ల‌తో హాట్ టాపిక్‌గా మారుతుంది. నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఆయన్ని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. గతేడాది నుంచీ ఈ ప్రచారం జరుగుతూ ఉన్న నేప‌థ్యంలో ఎట్టకేలకు తన పెళ్లి రూమర్లపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.

Rakul Preet Singh latest hot imagesనాకు గత నవంబర్‌లోనే పెళ్లి అయిపోయిందిగా’ అంటూ జోక్ చేసింది.. గూగుల్‌లో తన పేరు టైప్ చేస్తే ఏమొస్తుందో చెబుతూ… నేను పెళ్లి తేదీ గురించి ప్రత్యేకంగా సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతివారం నా మీద ఆర్టికల్స్ వ‌స్తూనే ఉన్నాయి. వాటి ప్రకారం నేను గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసేసుకున్న‌ట్టు తెలిసింది. నిజానికి నేను తీసుకునే ఆహారం, అందులో ఉండే కేలరీల గురించి ఎక్కువ‌గా గూగుల్ లో సెర్చ్ చేస్తాను. చాలా వరకు ఆహారం, కేలరీలు, ఆరోగ్యం గురించే నేను చదువుతాను అని రకుల్ స్ప‌ష్టం చేశారు.

also read :

Foods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..

healthy food for kids : పిల్లలు ఫుడ్‌ తినడానికి మారాం చేస్తున్నారా? ఈ టిప్స్‌ పాటిస్తే ఇష్టంగా తింటారు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News