maha shivaratri : మహాశివరాత్రికి ఎనలేని ప్రాశస్త్యం ఉంది. హిందూమతంలో ముఖ్యంగా తెలుగువారు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకొనే పండుగ మహాశివరాత్రి. శివుడంటేనే భోళాశంకరుడు. భక్తుల కోర్కెలను తీర్చే ఇలవేల్పు. మహాశివుడు ఆడంబరాలకు దూరం. చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి మారేడు పత్రాలు సమర్పించి పూజ చేస్తే పరవశించిపోతాడు. శివతత్వం మహాద్భుతం.
శివుడికి ప్రతి నెలా అమావాస్య ముందురోజు మాస శివరాత్రిగా జరుపుకుంటారు. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశినాడు మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2023 లో ఫిబ్రవరి 18 న జరుపుకుంటున్నాం. లింగోద్భవం జరిగిన రోజు ఎంతో ప్రత్యేకమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.
ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి శివుణ్ని ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని భక్తుల నమ్మకం. శివుడికి సోమవారం అత్యంత ప్రీతి పాత్రమైనదిగా చెబుతారు. మహా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం మంచిది.
మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండటం ఆనవాయితీ. ఈ సందర్భంగా కొందరు అనుకోని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా శివారాధన సందర్భంగా మనం చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి.
శివాలయానికి వెళ్లిన తర్వాత శివ లింగానికి అభిషేకం నిర్వహించాలి. ఉపవాసం ఉండేవాళ్లు రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత నక్తం (పూజ చేసి రాత్రికి బోజనం చేయడాన్ని ‘నక్తం’ అంటారు) ఉపవాసం విడిచి పెట్టాలి. మూడు పూటల్లో ఏదో ఒక సారి చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతున్నారు. కొంత మంది మధ్యలో పాలు, పండ్లు లాంటివి తీసుకోవచ్చని చెబుతున్నారు.
ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలి. శివుడికి పాలతో అభిషేకం చేసేటపుడు రాగి కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదని పెద్దలు చెబుతున్నారు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమవుతాయి. స్టీలు గిన్నె, లేదా మట్టి పాత్రలు ఉపయోగించాలి. ముఖ్యంగా గుళ్లో పండితులతో నమకం, చమకం 11 సార్లు పారాయణం చేస్తే రుద్రం అంటారు. అలా చేసిన వాళ్లకు పునర్జన్మ ఉండదని చెబుతారు.
శివుడికి పూజ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లాంటి పంచామృతాభిషేకాల తర్వాత నీళ్లతో కచ్చితంగా అభిషేకం చేయాలి. అనంతరం విభూతితో అలంకారం చేసి తిలకం దిద్దాలి. సింధూరాన్ని ఎట్టిపరిస్థితుల్లో వాడరాదు. శివలింగానికి గుడిలో పూర్తి ప్రదక్షిణలు చేయరాదు. ప్రదక్షణ చేసిన చేసిన పానవట్టం నుంచి తిరిగి వెనక్కి వెళ్లి ప్రదక్షిణలు చేయాలని పెద్దలు చెబుతున్నారు.
also read :
Maha Shivaratri : శివరాత్రి జాగారం నాడు ఏం చేయాలి? ఎలా చేస్తే శివానుగ్రహం సిద్ధిస్తుంది?
Maha Shivratri : మహా శివరాత్రి నాడు ఉపవాసం వల్ల ఫలితమేంటి?
Cheteshwar Pujara: టెస్టుల్లో పుజారా అరుదైన మైలురాయి.. ఆ ఛాంపియన్‌షిప్ గెలవడమే ధ్యేయం!
Sri Reddy: నరేష్, పవిత్రలకి క్లాస్ పీకిన శ్రీరెడ్డి.. దుమ్ము రేపేసిందంతే..!