Womens T20 World Cup 2023 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో భారత అమ్మాయిలు ఘన విజయం సాధించారు. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే గ్రాండ్ విక్టరీ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించారు. దీంతో తొలి మ్యాచ్‌లోనే టీమిండియా శుభారంభం చేసినట్లయింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్2 మ్యాచ్‌లో భారత మహిళలు సమష్టిగా రాణించారు. పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది హర్మన్ ప్రీత్‌కౌర్ సేన. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్.. బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.
పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మారూఫ్ అర్ధ శతకంతో రాణించింది. 55 బంతులు ఎదుర్కొన్న మారూఫ్.. 7 ఫోర్ల సాయంతో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. మరో బ్యాటర్ అయేషా నసీమ్ 25 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక భారత బౌలర్లలో రాధా యాదవ్ 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఓ మోస్తరు టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు.. అద్భుత ప్రదర్శన చేశారు.
కేవలం మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించారు. ఈ క్రమంలో రిచా ఘోష్ ఐదు ఫోర్ల సాయంతో 20 బంతుల్లోనే 31 పరుగులతో ఆఖరి దాకా పోరాడింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన జెమీమా రోడ్రిగ్స్ కేవలం 38 బంతుల్లోనే 8 ఫోర్లు బాదేసింది. ఆఖర్లో వరుస ఫోర్లతో అలరించింది. మొత్తంగా 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఇక తొలుత ఓపెనర్‌గా వచ్చిన షెఫాలీ వర్మ కూడా 25 బంతుల్లోనే 4 ఫోర్లతో 33 పరుగులతో అలరించింది.
పాకిస్తాన్ బౌలర్లలో నష్రా సంధు 15 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు ఇదే అత్యధిక పరుగుల ఛేజింగ్ కావడం విశేషం. మొత్తం మీద రెండో అత్యధిక ఛేజింగ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. 2009లో ఆసీస్‌పై ఇంగ్లండ్ 164 పరుగులను ఛేజ్ చేసి మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో మ్యాచ్‌లో బుధవారం వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటేనే భారతీయులకు ఎమోషన్ తన్నుకొచ్చేస్తుంది. ఈ మ్యాచ్‌లోనూ ఆద్యంతం ఉత్కంఠ కనిపించింది. భారత అమ్మాయిలు కొట్టే ప్రతి షాట్‌నూ క్రికెట్ అభిమానులు ఆస్వాదించారు.
also read:
ప్రేమ, సహజీవనం, యువతికి మరో పెళ్లి.. తర్వాత ఇంకో ట్విస్ట్!
నయనతార పబ్లిక్‌లో షారూఖ్‌కి ఇలా ముద్దు పెట్టేసిందేంటి?