Homeandhra pradeshAbdul Nazeer : ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌.. గవర్నర్‌ మార్పుతో ఏం జరగనుంది?

Abdul Nazeer : ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌.. గవర్నర్‌ మార్పుతో ఏం జరగనుంది?

Telugu Flash News

Syed Abdul Nazeer appointed as Andhrapradesh Governor news  : ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని మార్పు చోటు చేసుకుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థపై కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటుండటం, పాలన వ్యవహారాలపై రాజకీయ నేతల్లా విమర్శలు చేస్తుండడంతో ప్రభుత్వాధితనేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. రాజకీయాల్లో ఉండాల్సిన వారు గవర్నర్ల వ్యవస్థలోకి వస్తున్నారని, నేరుగా రాజకీయాలు చేయాలంటూ సూచిస్తున్నారు పలువురు నేతలు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుమంది న్యాయమూర్తుల బెంచ్‌లో జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఒకరు. దేశ వ్యాప్తంగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే ఏపీ గవర్నర్‌గా ఉన్న విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్‌ బైస్‌ను నియమించారు.

ఇక హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా శివ్‌ ప్రతాప్‌ శుక్లా, అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవల్య త్రివిక్రమ్‌ పర్నాయక్‌, సిక్కిం రాష్ట్ర గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య, ఝార్ఖండ్‌ గవర్నర్‌గా సి.పి.రాధాకృష్ణన్‌, అసోం గవర్నర్‌గా గులాబ్‌ చంద్‌ కటారియా, మణిపూర్‌ గవర్నర్‌గా అనుసూయ, నాగాలాండ్‌ రాష్ట్ర గవర్నర్‌గా గణేషన్‌, మేఘాలయ రాష్ట్ర గవర్నర్‌గా ఫాగు చౌహాన్‌, బిహార్‌ రాష్ట్ర గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌, లడాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బీడీ మిశ్రాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, పంజాబ్‌, తదితర రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవస్థపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గవర్నర్ల ద్వారా కేంద్రం రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వాధినేతలు మండిపడుతున్నారు. రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం లేని చోట్ల వివాదాస్పద అంశాలను లేవనెత్తడం, ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా కొందరు గవర్నర్లు పని చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక ఏపీలో ఇప్పటి వరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తన పరిధిలో తాను పని చేసుకున్నారు. కొత్త గవర్నర్‌ రాకతో మార్పు రానుందా అనేది వేచి చూడాల్సిందే.

FAQs
Q. who is present andhra pradesh governor ? ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు ?

A. Syed Abdul Nazir is a former Judge of the Supreme Court of India and currently serving as the 3rd Governor of Andhra Pradesh. ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.

-Advertisement-

also read :

aamir khan : వాక్ స్టిక్ సాయంతో న‌డుస్తున్న అమీర్ ఖాన్.. ఏమైంది ?

Ileana : ఇలియానా సినిమాల‌లో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదా?

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News