Homewomenమీ చీరలు కొత్త చీరల్లా మెరిసిపోవాలంటే..ఇలా చేసి చూడండి..

మీ చీరలు కొత్త చీరల్లా మెరిసిపోవాలంటే..ఇలా చేసి చూడండి..

Telugu Flash News

ఆవిడ పెళ్ళికి కొన్న చీర ఇంకా కొత్త దానిలా ఉందా ! ఆవిడ చీరలు అన్నీ అంతే ! ఆ రహస్యం ఏమిటో ! మీకు తెలుసుకోవాలని ఉందా..

  • చీర కొన్నంత హుషారు వాడకంలో చూపకపోతే ఇంతే సంగతులు. మన్నిక కావాలంటే జాగ్రత్త చేసుకునే శ్రద్ధ, ఓపిక ఉండాలి.
  • చీర కొనగానే ఫాల్ వెయ్యాలి. ఫాల్ లేకపోతే అంచులు పాడైపోతాయి, తేలికైన చీరలకు బరువు ఫాల్స్, బరువైన చీరలకు తేలిక ఫాల్స్ వేయకూడదు. చీర క్లాత్ కు సరిగ్గా మందం సరిపోయే ఫాల్ నే వేసుకోవాలి.
  • సిల్క్ చీరలకి కూడా అప్పుడప్పుడూ కొద్దిగా స్టార్చ్ పెట్టి, ఇస్త్రీ చేయించుకోవాలి. పొరపాటున కూడా వీటిని వేడినీటిలో నానబెట్టకూడదు. అలా చేస్తే చీరంతా ముడతలే ! ఇస్త్రీ చేసేప్పుడు కూడా తక్కువ వేడిని ఉపయోగించాలి.
  • పట్టు చీరలను కుంకుడు రసంతో శుభ్రం చేస్తే జిడ్డూ, మురికి బాగా వదులుతుంది. దీనికి గ్లిజరిన్ కలిపితే ముడతలు రాకుండా కాపాడుతుంది.
  • సిల్క్ చీరలను షాంపూ కలిపిన నీళ్ళలో జాడిస్తే మెరుపు, సువాసన వస్తాయి.
  • చీరలను బీరువాలో దాచేటప్పుడు న్యూస్ పేపర్లు మధ్యలో వేస్తే మడతల్లో నలిగిపోకుండా స్టిఫ్ గా ఉంటాయి.
  • బీరువాలో చీరల మధ్య వాడేసిన సాంబ్రాణీ కవర్లు, అగరబత్తీ పెట్టెలు, సబ్బుల కవర్లు ఉంచితే ఘుమఘుమల సువాసనలు మీ చీరలకు సొంతం.
  • చెక్క బీరువా అయితే అడుగున నాలుగు పొగాకు కాడలు వెయ్యాలి. అలా వేస్తే చెదలకు దూరంగా మీ చీరలు క్షేమంగా ఉంటాయి.
  • చీరలు మధ్య పురుగులు చేరకుండా ఉండాలంటే కర్పూరం బిళ్ళలు లేదా గంధం పాకెట్లు పెట్టుకోవాలి.
  • కొత్త చీరను ఉప్పు కలిపిన నీళ్ళలో జాడిస్తే రంగు వెలవకుండా ఉంటుంది. ఉప్పు బదులు కరక్కాయ పొడి కూడా వాడచ్చు.
  • బట్టలు ఉతికే నీటిలో నాలుగు చుక్కల గ్లిజరిన్ వేస్తే మెరుపే మెరుపు!
  • ఇస్త్రీ చేసి బట్టలను వెంటనే బీరువాలో పెట్టకూడదు. కాసేపు గాలికి ఆరనివ్వాలి. చీరలు
  • చీరలకు పేపరు చుట్టి పెడితే మెరుపు పోకుండా ఉంటుంది.
  • చీరపై ఎంబ్రాయిడరీ మెరుపు తగ్గితే నీళ్ళలో వెనిగర్ కలిపి ఆ నీళ్ళలో జాడించి అరవేస్తే ఎంబ్రాయిడరీ మళ్ళీ మెరుపు సంతరించుకుంటుంది. సిల్కు చీరలు ఉతికే నీళ్ళలో ఒక చెక్క నిమ్మరసం కలిపినా మెరుపు వచ్చేస్తుంది.
  • పట్టు చీరల మీద జరీ మాడిపోకుండా ఉండాలంటే ఇస్త్రీ చేసేటప్పుడు తప్పనిసరిగా పలుచటి వస్త్రాన్ని కానీ, పేపరుని కానీ పరచి దాని మీద ఇస్త్రీ చేయాలి లేకపోతే నల్లగా మాడిపోయే ప్రమాదముంది.
  • ఘాటైన లవంగాలు, మిరియాలు లేదా వేపాకులయినా ఉంచితే పురుగులు చేరవు. జరీ నల్లబడదు.
  • పట్టుచీరలు పదికాలాలు నిలవాలంటే ప్రతి సంవత్సరం డ్రై క్లీనింగ్ కి ఇవ్వాలి. అప్పుడప్పుడూ రోలింగ్ చేయిస్తూ ఉండాలి.
  • అతి ముఖ్యమైనది. చీరలకు పిన్నులు పెట్టి మన చీరలను మనమే పాడుచేసుకోకూడదు. క్లిప్స్ వాడితే మంచిది.
  • ఫంక్షన్ నుంచి రాగానే చీరను కాసేపు గాలిలో ఆరనివ్వాలి. అలాకాక ప్రొద్దున నుంచీ రాత్రి దాకా ఉంచేసు కున్నా మన్నిక ఉండదు మరి.
  • నాలుగుకాలాలు పాటు మీ చీరలు నిలవాలంటే రిబేటు ఉన్న చోటుకి వెళ్ళకండి. అవి ఎన్నో సంవత్సరాలు మూల పడి ఉంటాయని గుర్తు పెట్టుకోవాలి.

ఈ జాగ్రత్తలన్ని మీరు తీసుకుంటే మీ చీరలు ఎప్పటికీ, మనవరాళ్ళు వచ్చినా కొత్త చీరల్లా మెరిసిపోతూనే ఉంటాయి.

మహిళరాణుల కోసం మరిన్ని టిప్స్ :

Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..

which color to wear on which day ఏ రంగు చీర ఏ రోజు కట్టాలి?

pimples : మొటిమలున్నాయని మొహమాటపడకండి..ఇలా త‌గ్గించుకోండి..!

-Advertisement-

Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News