నేటి కాలంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉండి తీరాల్సిందే. సెల్‌ఫోన్‌తో ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అంతే తొందరగా వ్యాధుల బారిన పడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. రేయింబవళ్లూ సెల్‌ఫోన్ వెలుగుల్లో గడుపుతున్న వారు అధికమయ్యారు.
ఈ కారణంగా చాలా రకాల రోగాలు తొందరగా అటాక్ చేస్తున్నాయి. ఫోన్‌ను ఎక్కువగా చూడొద్దని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా విలువైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. తాజాగా సెల్‌ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల ఓ మహిళ తన కంటిచూపును కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.
భాగ్యనగరానికి చెందిన ఓ మహిళ.. రాత్రిపూట ఎక్కువగా సెల్‌ఫోన్ వాడుతుండేది. సోషల్ మీడియాతో పాటు అనేక రకాల యాప్స్‌తో ఎక్కువ సమయం గడుపుతుండేది. ఇన్‌స్టా గ్రామ్, యూట్యూబ్ రీల్స్ లాంటి వాటితో ఎక్కువగా గడిపేస్తుండేది.
దీంతో ఏకంగా కంటిచూపును కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నగరానికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కేవలం 30 ఏళ్ల వయసుకే బాధిత మహిళ తన చూపును కోల్పోయిందని ఆయన తెలిపారు.
ఇంత చిన్న వయసులోనే ఆమె తన చూపును పోగొట్టుకోవడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. మంజు అనే మహిళ ఈ డాక్టర్ వద్దకు వెళ్లింది. తనకు కదులుతున్నట్లు దృశ్యాలు, తీవ్రమైన మెరుపులు, డార్క్ జిగ్‌జాగ్ పాటర్న్‌లు కనిపిస్తున్నాయని చెప్పింది.
బయట ఎలాంటి వస్తువునైనా స్పష్టంగా చూడలేకపోతున్నానని పేర్కొంది. కొన్నాళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నానని, ఈ మధ్య ఎక్కువైందని తెలిపింది.
మహిళ సమస్య విన్న డాక్టర్ సుధీర్.. ఆమెకు వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బాధిత మహిళకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ (SVS) అనే జబ్బుతో బాధపడుతోందని గుర్తించారు.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVC)తో సైతం ఆమె సఫర్ అవుతోందన్నారు. ఇలాంటి సమస్యలు అంధత్వం సహా కంటి సమస్యలకు దారి తీస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆమెకు నయం అయ్యిందని వెల్లడించారు. నెల రోజుల తర్వాత కంటిచూపు తిరిగి వచ్చిందన్నారు.
also read:
Viral Video: పెళ్లిలో పన్నీర్ కోసం లొల్లి.. బుర్రలు పగిలేలా కొట్టుకున్నారు!
Rashmi Gautham: ఈ సారి రష్మీ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టబోతుందా ?