HomehealthDiabetes : మధుమేహ రోగులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

Diabetes : మధుమేహ రోగులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

Telugu Flash News

మధుమేహం(Diabetes) రోగి విషయంలో ఆహారం ప్రాధాన్యత చాలా వుంది. తీసుకునే ఆహారంలో తగినన్ని క్యాలరీలు ఉండాలి. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడగలగాలి. మంచి శక్తిని ప్రసాదించాలి. అదే సమయంలో శరీరంలో ఇన్సులిన్ (insulin) లోపానికి తగిన విధంగా ఆహారం ఇవ్వాలి. అందుకని తినకూడని పదార్థాలు కొన్ని ఉంటే, తినవలసినవి కొన్ని ఉన్నాయి.

అందరు మధుమేహ రోగుల్లో ఆహారం ఒకటే కొలత కాదు. వారి బరువు, వారు చేసే శారీరక శ్రమ, వయస్సు బట్టి ఉంటుంది.

Diabetes

ఆహారం మనిషికి శక్తినిస్తుంది. శరీరం ఎదుగుదలకి తోడ్పడుతుంది. ఆరోగ్యానికి రక్షణ కలిగిస్తుంది. ఆహారంలో పిండిపదార్థాలు(carbohydrates), మాంసకృత్తులు(proteins), కొవ్వు పదార్థాలు(fats), విటమిన్లు(vitamins), ఖనిజలవణాలు(minerals) ఉంటాయి. ఇవన్నీ సమపాళ్ళలో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. శక్తి చేకూరుతుంది. అయితే మధుమేహ రోగిలో పిండి పదార్థాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం ఉండదు. అందుకని పిండిపదార్థం తగ్గించాలి.

carbohydrates


పిండిపదార్థాల్లో సింపుల్, కాంప్లెక్స్ అని రెండు రకాలు ఉన్నాయి. గ్లూకోజ్, జామ్, ఐస్ క్రీమ్, కేక్స్ వంటివి సింపుల్ కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు). వీటి నుంచి శక్తి వెంటనే చేకూరుతుంది. ఇవి తీసుకోగానే ప్రేగుల నుంచి వెంటనే రక్తంలోకి చేరుతాయి. మధుమేహ రోగి వీటిని తీసుకున్నప్పుడు రక్తంలో గ్లూకోజు శాతం పెరుగుతుంది. అలా రక్తంలో షుగర్ అధికశాతంలో నిలబడిపోవటం మంచిది కాదు.

-Advertisement-

రాగులు, జొన్న, గోధుమ, ఆకుకూరలు, కాయగూరల్లో ఉండే పిండిపదార్థాన్ని కాంప్లెక్స్  కార్బోహైడ్రేట్స్ అంటారు. ఇది నిదానంగా రక్తంలోకి చేరుతుంది. తీపి పదార్థాలు లాగా వెంటనే రక్తంలోకి చేరటం, రక్తంలో షుగర్ శాతం త్వరగా పెరగడం ఉండదు. మధుమేహ రోగిలో ఇలా త్వరగా షుగర్ పెరగకుండా ఉండటమే కావాలి.

స్థూలకాయం(obesity) తెచ్చే ఇబ్బంది

స్థూలకాయం ఉండే వారి కణాలగోడల్లో “insulin receptor sites” తక్కువగా ఉంటాయి. ఈ ఇన్సులిన్ రెసెప్టార్ సైట్స్ కణాల గోడలలోకి తలుపులుగా పనిచేస్తాయి. ఇన్సులిన్ తో కలిసిన గ్లూకోజుని కణాల లోపలికి వెళ్ళడానికి తోడ్పడతాయి.  స్థూలకాయం ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసెప్టార్ సైట్స్ తక్కువ ఉండి కణాలలోకి గ్లూకోజు చేరదు. obesity అందుకోసం పాన్ క్రియాస్ గ్రంధి ఎక్కువ శ్రమ చెంది ఇన్సులిన్ ని మరింత ఉత్పత్తి చేస్తుంది. స్థూలకాయం తగ్గితే కణాల గోడల మీద ఇన్సులిన్ రెసెప్టార్ సైట్స్ పెరుగుతాయి. గ్లూకోజు తేలికగా కణాలలోకి చేరుతుంది. మామూలుగానే స్థూలకాయం అవరోధంగా తయారయితే మధుమేహం ఉన్నవారిలో మరింత అవరోధంగా మారుతుంది.

Diabetes రోగులు మితంగా భుజించాలి

మితంగా భుజించేవారికి స్థూలకాయం రావడం ఉండదు. మామూలుగా ఆరోగ్యవంతునిలో రోజుకి 2500 నుంచి 3500 కేలరీలు సరిపోతాయి. అంతకంటే ఎక్కువ తిన్న ఆహారం శరీరంలో కొవ్వుగా చేరుతుంది. చాలామంది తమకి కావలసిన దానికంటే ఎక్కువ భుజిస్తారు. ఒక పౌండు క్రొవ్వు 3500 క్యాలరీలకి సమానం.


ఒక వ్యక్తి తనకి కావలసిన క్యాలరీలకంటే అధికంగా 500 క్యాలరీలు రోజూ తీసుకుంటే వారం గడిచేసరికి ఒక పౌండు బరువు పెరగడమవతుంది.

అలాగే ఆహారంలో క్యాలరీలు తగ్గించినట్లయితే నిదానంగా బరువు తగ్గడం ఉంటుంది.

ఆహారంలో ఫైబర్ ప్రాధాన్యత

పొట్టున్న బియ్యం, గోధుమలు, జొన్న, రాగులు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్లు, బఠానీలలో పీచుపదార్థం (fiber) ఎక్కువ ఉంటుంది. ఆహారంలోని పీచు జీర్ణం కాకుండా ప్రేగుల్లోనే ఉంటుంది. పైగా పీచు ఆహారంలోని పిండిపదార్థాన్ని త్వరగా ప్రేగుల్లోనుంచి రక్తంలోకి చేరకుండా నిరోధిస్తుంది. దానివల్ల ఆహారం తీసుకున్నా రక్తంలోని షుగర్ శాతం త్వరత్వరగా పెరగడం ఉండదు. ఆహారంలోని ఫైబర్ రక్తంలోని కొలెస్టరాల్ శాతం పెరగకుండా నిరోధిస్తుంది. fiber

పొట్టుతీయని బియ్యం, గోధుమ, జొన్న, రాగులలో ఫైబర్ శాతం ఎక్కువ ఉన్నా వాటిలో పిండి పదార్ధం ఎక్కువ ఉంటుంది. వాటిని తక్కువ తీసుకోవాలి.

ములక్కాడలు, చిక్కుళ్ళు , బఠానీలు, బెండకాయలు, వంకాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి.


ఆకుకూరలు, కాయగూరల్లో కేలరీలు తక్కువ

మధుమేహరోగి కేలరీలు ఎక్కువ ఉండే ఆహారం కాకుండా కేలరీలు తక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. కేలరీలు ఎక్కువవుండే ఆహారపదార్థాలు తీసుకుంటే అవి ఒంటబట్టటానికి అధికంగా ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఇన్సులిన్ తక్కువ ఉన్నప్పుడు రక్తంలోనే గ్లూకోజు అధికంగా పేరుకునిపోయి రకరకాల దుష్ఫలితాలను కలిగిస్తాయి.

ఒకవేళ మధుమేహరోగి ఎక్కువగా తిని రక్తంలో అధికంగా పేరుకొనిపోయే గ్లూకోజు తగ్గడానికి ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ పుచ్చుకుంటే స్థూలకాయం పెరగడమే తప్ప మరొకటి లేదు. అలా పెరిగిన స్థూలకాయం మరింత హాని చేస్తుంది. అందుకని మధుమేహరోగి తనకి కావలసిన దానికంటే మించి కేలరీలు ఎక్కువ తీసుకోకూడదు. సాధారణంగా 1500 నుంచి 2000 కేలరీలు సరిపోతాయి.

తక్కువ క్యాలరీలతో సుష్టుగా భోజనం

చాలామందికి కడుపునిండి భోజనం చేస్తే తప్ప తిన్నట్లు అనిపించదు. ఇటువంటి వారు ఆహారంలో అన్నం తగ్గించి కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తినాలి.

బీరకాయ, పొట్లకాయ, బెండకాయ, వంకాయ, దోసకాయ, చిక్కుళ్ళు, క్యాబేజి, కాలిఫ్లవర్, క్యారెట్, ములక్కాడలు, ఆకుకూరలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.



మధుమేహ రోగి టమాటో, నిమ్మ, ఉసిరి వంటివి పుష్కలంగా తీసుకోవచ్చు.

అన్నం బాగా తగ్గించి క్యాబేజి, కాలిఫ్లవర్, కేరట్, టొమాటో ముక్కలతో సలాడ్ చేసుకుని కడుపునిండా తినవచ్చు.

Diabetes రోగులు మాంసాహారం మానివేయాలా?

మాంసాహారం తీసుకునే వ్యక్తులు కోడిగుడ్లు, కోడిమాంసం, చేపలు తినవచ్చు. కొలెస్టరాల్ ఉన్నవాళ్ళు కోడిగుడ్డులోని పచ్చసొన తీసుకోకూడదు.

రోజూ కోడిమాంసం, చేపలు తీసుకోవచ్చు. వేటమాంసం, పందిమాంసం వీటిని ఎప్పుడో తప్ప రెగ్యులర్ గా తీసుకోకూడదు. వీటిల్లో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది. క్రొవ్వులో కేలరీలు ఎక్కువ ఉండి ఒంటికి క్రొవ్వు చేరుతుంది.

పప్పులలో మాంసకృత్తులు ఉంటాయి. నాన్ వెజిటేరియన్ తిననివారు పప్పులు మామూలుగా తినవచ్చు. శరీరంలో కణాల నిర్మాణానికి, రక్షణ కణాలు తయారు కావడానికి మాంసకృత్తులు అవసరం ఉంది.

బొప్పాయి (popaya) మంచిది



మధుమేహ రోగులు అరటిపండు, కమల, సపోటాపండు, పళ్ళు ఏవీ తినకూడదు. వీటిల్లో గ్లూకోజు శాతం అధికంగా ఉంటుంది. పైగా వీటిల్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండి నేరుగా రక్తంలోకి చేరి బ్లడ్ షుగర్ లెవెల్స్ త్వరత్వరగా పెరిగిపోతాయి.

ఇలా పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడానికి మధుమేహ రోగిలో ఇన్సులిన్ రెడీగా ఉండదు. దానితో రక్తంలో పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్స్ మౌనంగా ఊరుకోక కంటి నరాల్ని దెబ్బతీస్తాయి. మూత్రపిండాలని దెబ్బతీస్తాయి. అందుకని  బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి ఉండకుండా మధుమేహ రొగులు జాగ్రత్తపడాలి. popaya

పళ్ళు తినడానికి కుదరని మధుమేహ రోగి బొప్పాయి  పండు తినవచ్చు. పుచ్చకాయ కూడా ఒక ముక్క తినవచ్చు,  జామకాయ తినవచ్చు. యాపిల్ తినవచ్చు.

Diabetes రోగులు తేనె తీసుకోవచ్చా?

మధుమేహ రోగి అప్పుడప్పుడు ఒక చెంచాడు తేనె తీసుకోవచ్చు.తేనెలో గ్లూకోజు ఉండదు. ఫ్రక్టోజు ఉంటుంది. ఫ్రక్టోజు బ్లడ్ షుగర్ ని పెంచదు. తేనె ఎక్కువ తీసుకుంటే కేలరీలు ఎక్కువ అవుతాయి. అందుకని మామూలుగా రోజూ తేనె సుకోకూడదు.

అన్నంతో కూరలు కాదు. కూరలతో అన్నం

మామూలుగా అన్నం ఎక్కువ పెట్టుకుని కూరలు అద్దుకుని తీసుకుంటాం. కాని, మధుమేహం ఉన్న వ్యక్తి అన్నం బాగా తగ్గించాలి. కూరలు ఎక్కువగా తీసుకోవాలి. దానితో పిండి పదార్థం తక్కువగా తీసుకోవడమవుతుంది.



సాధారణంగా మధుమేహ రోగి విషయంలో అతను ఉన్న బరువు , చేసేపని, మధుమేహం తీవ్రతని బట్టి డాక్టరు ఆహారం తీసుకోవాలో నిర్ణయిస్తాడు. సాధారణంగా మూడు కప్పుల అన్నం , కప్పు పప్పు, కప్పు సాంబారుతో పాటు కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవచ్చు.

వేపుడు కూరలు, నెయ్యి నిషిద్ధం

మధుమేహ రోగి వేపుడు కూరలు, నెయ్యి వాడకూడదు. కోసం నూనె, నెయ్యి వాడటంవల్ల ఆహారంలో కేలరీలు అధికం అవుతాయి. అలాగే నెయ్యి, వెన్న, మీగడ పనికిరావు. అందులో కూడా కేలరీలు అధికంగా వుంటాయి. మధుమేహ రోగి కూరలు ఉడక పెట్టి అందులో తాలింపు వేసి రుచిగా భుజించవచ్చు.

నియమిత సమయానికి భోజనం

మధుమేహ రోగి నియమిత సమయానికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకోవాలి. మధ్యలో ఆకలి అనిపిస్తే వెన్న తీసిన మజ్జిగ త్రాగవచ్చు. పంచదార లేని కాఫీ, టీలు త్రాగవచ్చు. పంచదారవేసిన కాఫీ, టీలు త్రాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మధుమేహ రోగి పాలు ఎక్కువ త్రాగడం మంచిది కాదు. అందులోని క్రొవ్వు కేలరీలని పెంచుతాయి.

రెండుసార్లు భోజనం నాలుగుసార్లుగా !

రోజు మొత్తం మీద తీసుకోవలసిన కేలరీలకి మించి తీసుకోకూడదు. ఆ మొత్తం కేలరీలని రోజు మొత్తం మీద విభజించి తీసుకోవచ్చు.మధుమేహరోగి ఒకేసారి కడుపునిండా భోజనం చేయడం కాకుండా విభజించి తీసుకోవడం మంచిది. ఒక్కసారిగా ఎక్కువ తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరుగుతాయి. అందుకని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం లైట్ గా టిఫిన్, రాత్రి భోజనం ఇలా నాలుగుసార్లు ఆహారం తీసుకోవచ్చు.


Diabetes ఉన్న వ్యక్తులు ఉపవాసం చేయకూడదు

మధుమేహం ఉన్న వ్యక్తి ఉపవాసం చేయకూడదు. ఉపవాసం చేసినట్లయితే మెటబాలిజంలో అస్తవ్యస్తత వచ్చి మధుమేహం అదుపు తప్పడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి మధుమేహ రోగి అపస్మారకంలోకి జారుకోవడానికి, కీటోసిస్ రావడానికి ఆస్కారం ఉంది. అందుకని ఉపవాసాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావు. నియమిత మోతాదులో ఆహారం తీసుకోవాలి. రంజాన్ పండుగ దినాల్లో మహమ్మదీయులు, మరికొన్ని వ్రతాల రోజుల్లో హిందువులు ఉదయం నుంచి రాత్రి వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. మధుమేహం ఉన్నవారు ఇటువంటి ఆచారాలను పాటించకూడదు.

మరిన్ని ఆరోగ్యకరమైన వార్తలు చదవండి :

sleeping tips : నిద్ర పట్టడం లేదా ? ఈ 9 చిట్కాలు మీకోసమే..

fruits with benefits : ఏ పండు ఏమిస్తుందో చూద్దామా?

పోషకాహారం అంటే ఏమిటి ? పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులు ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News