సాధారణంగా ఇంట్లో చేసుకున్న కొన్ని రకాల వంటకాలు మిగిలిపోతే వాటిని ఫ్రిడ్జ్‌లో ఉంచుతుంటాం. మరుసటి రోజు కాస్త వేడి చేసుకొని తినడం చాలా మంది చేస్తుంటారు. ప్రతి ఇంట్లో ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. అయితే, ఇలా కొన్ని పదార్థాలు వేడి చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏ పదార్థమైనా ఎక్కువ సార్లు వేడి చేయడం మంచిది కాదట. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు దెబ్బతింటాయి. నూనె పదే పదే వేడి చేయరాదు. ఇలా చేస్తే అందులోని ట్రాన్స్‌ఫ్యాట్ కంటెంట్ ప్రమాదకరస్థాయికి చేరుకుంటుంది. చికెన్‌ను వంట చేసుకున్నప్పుడే తినేయాలి. మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే విషంగా మారే చాన్స్ ఉంది. ఇలా ఏవైనా ఆహారాలు వండినపుడే తినడం మంచిది.. మళ్లీ మళ్లీ వేడి చేస్తే ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి.. ఎప్పటికపుడు తాజా ఆహారంనే తీసుకోండి.
also read:
Gang Leader: గ్యాంగ్ లీడర్ రీరిలీజ్ ఎందుకు వాయిదా ?
Hyper Aadi: శృతి మించుతున్న హైపర్ ఆది బూతు కామెడీ..