Fruits to Help You Sleep : హాయిగా నిద్రపోవాలని అందరూ అనుకుంటారు. అయితే, చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కొందరు ప్రశాంతమైన నిద్ర పట్టక, సెల్ఫోన్ల వెలుగుల్లో గడిపేస్తుంటారు. అయితే, పడుకొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పడుకొనే ముందు ముఖ్యంగా కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకుంటే ఇట్టే నిద్ర పట్టేస్తుందని చెబుతున్నారు.
1. నిద్రకు ఉపక్రమించే ముందు అరటిపండు తినడం వల్ల కండరాలకు ఉపశమనం ఇస్తుంది. రక్తపోటును నియంత్రించే శక్తి అరటిపండుకు ఉంది. నిద్ర బాగా పట్టేందుకు అరటి పండు దోహదం చేస్తుంది.
2. నిద్ర నాణ్యతను మెరుగుపర్చడంలో చెర్రీస్ది కీలక పాత్ర. మెగ్నీషియం, మెలటోనిన్ ఉంటాయి.
3. కివీ ఫ్రూట్ నిద్ర రుగ్మతలను పోగొడుతుంది.
4. మెలటోనిన్ స్థాయిలను పెంచేందుకు పైనాపిల్ తినాలి.
5. నారింజలు, టమోటాలు, జామ పండు లాంటివి తిన్నా నిద్రకు సహకరిస్తాయి.
also read:
Kiara Advani: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన కియారా.. సస్పెన్స్ వీడింది..!
Varsha : కెరీర్ మొదట్లో వర్షని కూడా అంతగా ఇబ్బంది పెట్టారా..!