Viral video news in Newzealand : న్యూజిలాండ్‌లో కుండ పోత వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడి ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ఆక్లాండ్‌లో పరిస్థితి దయనీయంగా మారుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. రహదారుల్లోనూ వరద నీటి కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతయారం కలుగుతోంది. వాహనాలు రోడ్లపై కొట్టుకుపోవడం కనిపిస్తోంది.
అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల నుంచి సామాగ్రి కొట్టుకుపోవడంతో పలువురు తినడానికి తిండిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని హప్కిన్స్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతోనే ఇలా జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాల్లో వరద నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.
తాజా పరిస్థితిపై ప్రధాని సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసులను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓవైపు వరద నీటితో రోడ్లన్నీ నిండిపోగా.. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వరద నీరు రోడ్డుపై ఉండగా.. ఓ బస్సు డ్రైవర్ వేగంగా నీటిలోనే బస్సును నడుపుకుంటూ వెళ్లాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెబ్బీ బరోస్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వరద ప్రభావానికి గురై రెండు కార్లు వరద నీటిలో కొట్టుకొని వచ్చాయి. అంతటి వరద నీటిలోనూ బస్సు సులభంగా, వేగంగా వెళ్లడాన్ని వీడియోలో చూడొచ్చు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఆశ్చర్యకరంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
also read :
Tarakaratna : నందమూరి తారకరత్న పరిస్థితి విషమం.. విదేశాలకు తరలించే యోచన!
Nara Lokesh పాదయాత్రలో ఉద్రిక్తత.. వెహికల్స్ సీజ్ చేసిన పోలీసులు