Ram Charan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి సీజన్ మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో రెండో సీజన్ కూడా మొదలు పెట్టి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌తో ముగించారు.
అయితే పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో హంగామా తారా స్థాయికి చేరింది. పవన్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటిటిలో ప్రసారం మొదలైంది. అందులో భాగంగా.. ప్రభాస్ ఎపిసోడ్ తరహాలోనే ఈ ఎపిసోడ్ లో కూడా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని ఫోన్ లైన్ లో తీసుకున్నారు.
మీ నాన్న దగ్గర లేనప్పుడు మీ బాబాయ్ తో జరిగిన పెద్ద సీక్రెట్ ఏంటి అని బాలయ్య.. రామ్ చరణ్‌ని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన రామ్ చరణ్ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. తనకి నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు కళ్యాణ్ బాబాయ్ తో సింగపూర్ కి వెళ్ళాను. దగ్గర నాన్న, అమ్మ ఎవరూ లేరు.
దీనితో కళ్యాణ్ బాబాయ్ తో కలసి పిజ్జాలు, బర్గర్ లు ఇష్టం వచ్చినట్లు తినేసా. అవి తేడా కొట్టి ఒక చోట విపరీతంగా వాంతులు చేసుకున్నా. అప్పుడు కళ్యాణ్ బాబాయ్.. నేను వాంతులు చేసుకున్న దానిని, నన్ను తన చేతులతో క్లీన్ చేశాడు అని రాంచరణ్ రివీల్ చేశాడు.
also read:
Dried dates benefits : ఎండు ఖర్జూరంతో ఎనలేని ఉపయోగాలు.. రోజూ తప్పక తినండి!
Viral video : అక్కడ డ్యాన్స్ చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష.. ఇరాన్లో యువ జంటకు షాక్!