Nayanthara: సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం తెలిసిందే. ఎంతో మంది క్యాస్టింగ్ కౌచ్ బాధితులమని రీసెంట్ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
భారతీయ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఖచ్చితంగా ఉంది అని నేను చెప్పను గానీ.. తాను మాత్రం క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నట్లు పేర్కొంది.ఒక తమిళ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం తనను ఒక దర్శకుడు కమిట్మెంట్ అడిగాడంటూ కామెంట్స్ చేసింది.
‘సినిమాలో ముఖ్యమైన పాత్ర, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి కమిట్మెంట్ అడిగాడని.. అయితే తాను ధైర్యవంతురాలిని కాబట్టి డైరెక్ట్ గా ముఖం మీదే ఏ అవకాశమూ వద్దని చెప్పేసిందట. తను కేవలం తన యాక్టింగ్ స్కిల్స్, టాలెంట్ ని మాత్రమే నమ్ముకున్నానని ఆమె వెల్లడించింది.
సినిమా అవకాశాల కోసం కమిట్మెంట్ ఇస్తే.. మీకు టాలెంట్ లేదని ఒప్పుకుంటున్నట్లు అని ఆమె వ్యాఖ్యానించింది. కమిట్మెంట్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుందని.. ఇస్తే ఒకలా, ఇవ్వకపోతే ఒకలా ఫలితం ఉంటుందని.. అయితే మనం ఏ దారిని ఎంచుకున్నామన్నదే ముఖ్యమంటూ నయనతార పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
also read :
ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!
రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలా.. ఈ ఫుడ్స్ తింటే తిరుగుండదు!
ఫేస్ ఆయిల్స్‌తో నిగనిగలాడే చర్మ సౌందర్యం.. ఎలా వాడాలో తెలుసుకోండి..