నిత్యం కూరల్లో కొత్తిమీర (coriander leaves) తప్పనిసరిగా వాడుతుంటారు. ఇది వంటకాల రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కొత్తిమీర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. వంటకాల్లోనే కాకుండా పలు రకాల ఔషధాల తయారీకి కూడా కొత్తిమీరను వినియోగిస్తారు. కొత్తిమీర కాండం, ఆకులు, గింజల్లోనూ చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి.
1. మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కొత్తిమీరలోని కాల్షియం, పొటాషియం, సోడియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఉపయోగపడతాయి.
2. రోగ నిరోధక శక్తి పెంచడం, సీజనల్ వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొత్తిమీర దోహదపడుతుంది.
3. కాలేయ వ్యాధుల నివారణకు కొత్తిమీర ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి.
4. పేగు సంబంధ వ్యాధులు కూడా కొత్తిమీర తినడం వల్ల నయమవుతాయి. గుండె జబ్బుల తాకిడి తగ్గుతుంది.
5. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచడానికి కొత్తిమీర ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్న వారు కొత్తిమీర తీసుకుంటే అదుపులో ఉంటుంది.
also read :
Singer Mano : సింగర్ మనోకి కూడా మల్లెమాలతో గొడవలా.. అందుకే జబర్ధస్త్‌ని వీడాడా.!
Ileana: ఆసుపత్రి బెడ్ పై ఇలియానా.. ఆహారం కూడా తినలేని స్థితిలో ఉందా?