HomenationalUnion Budget 2023 : నేటి నుంచే పార్లమెంటు సమావేశాలు.. బడ్జెట్‌ షెడ్యూల్‌ పూర్తి వివరాలివే..

Union Budget 2023 : నేటి నుంచే పార్లమెంటు సమావేశాలు.. బడ్జెట్‌ షెడ్యూల్‌ పూర్తి వివరాలివే..

Telugu Flash News

Union Budget 2023 : పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు పార్లమెంటులో జీరో అవర్, ప్రశ్నోత్తరాలు ఉండవు. రాష్ట్రపతి ప్రసంగించిన తర్వాత సామాజిక ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈ సర్వేలో వెల్లడి కానుంది. సర్వే గణాంకాల ప్రకారం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు 2023-24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో బడ్జెట్‌ అంశాలను పార్లమెంటులో చదివి వినిపిస్తారు. సాధారణ బడ్జెట్‌ను తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టాక అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మల.

ఉభయ సభలూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం చర్చ కొనసాగిస్తాయి. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్షాల ప్రశ్నలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానాలు ఇస్తారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించిన కేంద్రం.. సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరింది. అన్ని పార్టీల సమావేశానికి 27 పార్టీల నుంచి 37 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది.

ఆల్‌ పార్టీ మీటింగ్‌లో పలు పార్టీలకు చెందిన సభ్యులు కీలక సూచనలు చేశారు. చైనా దురాక్రమణలపై పార్లమెంటులో చర్చ జరగాలని బీఎస్పీ డిమాండ్‌ చేసింది. ఈ సమయంలో అది కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. బడ్జెట్‌పైనే ప్రధానంగా చర్చ జరగాలని పార్టీలకు సూచించింది కేంద్రం. మరోవైపు నిబంధనల ప్రకారం ఏ అంశాన్ని అయినా చర్చించేందుకు అనుమతిస్తామని కూడా కేంద్రం స్పష్టం చేసింది.

నాలుగు రోజులుగా స్టాక్‌ మార్కెట్‌ను కుదిపేస్తున్న అదానీ షేర్ల వ్యవహారంపై చర్చకు ఆమ్‌ ఆద్మీ, ఆర్జేడీ పట్టుపట్టాయి. ఇక దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని వైసీపీ కోరింది. అయితే, వీటిలో ఏ అంశంపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడం గమనార్హం. బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి దశ ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వరకు, రెండో దశ మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఉంటుంది.

also read :

-Advertisement-

Deepika Padukone Hot Photos at Pathaan Press Meet

High blood pressure : ఈ 4 జ్యూస్‌లు తాగితే అధిక రక్తపోటును అడ్డుకోవచ్చు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News