Homebeautypimples : మొటిమలు పోవాలంటే ఏం చేయాలి..ఇలా త‌గ్గించుకోండి..!

pimples : మొటిమలు పోవాలంటే ఏం చేయాలి..ఇలా త‌గ్గించుకోండి..!

Telugu Flash News

pimples : మొటిమలతో బాధపడేవారు ఇంటి చిట్కాల ద్వారా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. పసుపులో పుదీన రసం కలిపి మొటిమలతో పాటు చర్మసంబంధ సమస్యలున్నచోట రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే త్వరగా ఫలితం కనిపిస్తుంది.
  2. పసుపు, వేపాకు కలిపి రుబ్బి రాస్తే మొటిమలు, మొటిమల మచ్చలు కూడా తగ్గిపోతాయి.
  3. జాజికాయను పచ్చిపాలతో కలిపి గ్రైండ్ చేసి మొటిమల మీద రాస్తే త్వరగా మంచి ఫలితం ఉంటుంది. మొటిమ రాలిపోవడంతో పాటు మచ్చ కూడా పడదు.
  4. మూడు స్పూన్ల తేనెలో ఒక స్పూను దాల్చిన చెక్క పొడి కలిపి రాత్రి పడుకోబోయే ముందు మొటిమల మీద రాసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే మొటిమలు పూర్తిగా పోవటంతో పాటు ఎప్పటికీ రావు.
  5. ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడి కలిపి రాసినా మొటిమలు పోతాయి.
  6. కమలాపండు తొక్కలను అవసరమైన మేరకు నీటిని కలుపుతూ మెత్తగా రుబ్బి ఆ మిశ్రమాన్ని మొటిమల మీద రాయాలి. pimples
  7. వెల్లుల్లిరేకను కొద్దిగా చిదిమి మొటిమ మీద చుట్టూ రాస్తుంటే మొటిమలు మచ్చపడకుండా పోతాయి.
  8. ఒక టేబుల్ వేరుశెనగ నూనెలో అంతే మోతాదు తాజా నిమ్మరసాన్ని కలిపి క్రమం తప్పకుండా ముఖానికి రాస్తే మొటిమలు రావు.
  9. మొటిమలు పెద్దవిగా ఉబ్బినట్లు ఉంటే పచ్చి బొప్పాయి రసం రాస్తే మంచి ఫలితం ఉంటుంది…

మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం చదవండి : 

Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..

eye care tips : ప్రపంచ అందాలను చూసే మీ కళ్ళు కాపాడుకోవాలంటే..?

how to get soft feet : మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News