ఒత్తయిన జుట్టు అందాన్ని పెంచుతుంది. అయితే, జుట్టు రాలే సమస్య (Hair Fall) తో చాలా మంది సతమతం అవుతుంటారు. మనం తీసుకొనే ఆహారం, కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలడం సమస్య పెరిగితే బట్టతలకు దారి తీస్తుంది. జుట్టును కాపాడుకొనేందుకు మార్కెట్లో దొరికే అనేక ప్రోడక్టులను వాడుతుంటారు. ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
- ఉల్లిపాయను తొక్క తీసేసి మిక్సీలో వేయాలి. మెత్తగా రుబ్బాలి. అనంతరం రసాన్ని తీసేయాలి. ఇలా తయారు చేసుకున్న రసాన్ని జుట్టు మూలాల్లో బాగా పూసుకోవాలి. అనంతరం చేతులతో మసాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుతుంది.
- ఓ కప్పు మెంతులు రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయం వీటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పూసుకోవాలి. అరగంట పాటు వదిలేసి తర్వాత క్లీన్ చేసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది.
- ఓ గిన్నెలో చెంచాడు ఉసిరిపొడి, నీరు కలిపి పేస్ట్ చేసుకోవాలి. నిమ్మరసం రెండు చుక్కలు కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసుకొని అరగంట పాటు ఉంచాలి. అనంతరం షాంపూతో క్లీన్ చేసుకుంటే జుట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంది.
also read:
Tarakaratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. ఆ వ్యాధి అంత ప్రమాదకరమా ?
Aryna Sabalenka: అవమానాలే నిచ్చెనమెట్లుగా చేసుకొని.. సబలెంకా విక్టరీపై ప్రశంసల వర్షం!
-Advertisement-