Sunday, May 19, 2024
Homeviral newsViral Video Today : రోడ్డుపై బుల్లెట్‌ బండితో ఫీట్లు.. ప్రాణాలతో చెలగాటం.. వైరల్ వీడియో

Viral Video Today : రోడ్డుపై బుల్లెట్‌ బండితో ఫీట్లు.. ప్రాణాలతో చెలగాటం.. వైరల్ వీడియో

Telugu Flash News

Viral Video Today : బైకు నడపడం అంటే కొందరు యువకులకు చాలా మోజు. ఈ క్రమంలో ఇంట్లో వారి గురించి ఆలోచించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నిత్యం వాహనాలు రద్దీగా వెళ్లే రోడ్లపై బైకుల్లో తిరుగుతూ కొందరు యువకులు స్టంట్లు చేస్తుంటారు.

ఈ ఫీట్లు చేసే క్రమంలో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. రోడ్డు ప్రమాదాలపై అధికారులు, తల్లిదండ్రులు ఎంత అవగాహన కల్పించినా యువతలో మార్పు రావడం లేదు.

తాజాగా ఇద్దరు యువకులు రోడ్డుపై బుల్లెట్‌ బండితో ఫీట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. దీన్ని ముందు వైపు వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

కర్ణాటకలోని విజయనగరలో జరిగిన ఈ ప్రమాదం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీడియోలో కొందరు యువకులు బైకులపై వెళ్తున్నారు. ఒకరికంటే ఒకరు వేగంగా వెళ్లాలని ప్రయత్నిస్తూ కనిపించారు.

ఈ క్రమంలోనే ఇద్దరు హెల్మెట్‌ ధరించకుండా బుల్లెట్‌ బండిపై డివైడర్‌కు దగ్గరగా స్పీడుగా వెళ్తున్నారు. ఇంతలోనే పట్టు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో వెనకాల కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోయాడు. అతనిపై వెనకాల వస్తున్న బైక్‌లు కూడా ఎక్కేశాయి. దీంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఎందరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా యువత మారడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైకులతో రోడ్లపై చెలగాటం ఆడవద్దని హితవు పలుకుతున్నారు. మంచి కెమెరామెన్‌.. బాగా వీడియో తీశాడంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. ఈ వీడియోను ప్రజావాణి అనే ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

-Advertisement-

also read news:

Tollywood News : చిరంజీవి, బాల‌కృష్ణ‌ల భార్య‌ల‌లో ఈ కామ‌న్ పాయింట్ గుర్తించారా..!

Pawan Kalyan Varahi: ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన వారాహి.. అసలు సంగ్రామం ఇప్పుడు మొదలవుతుందా?

Sharwanand – Rakshitha reddy Engagement Photos

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News