Padma Awards 2023 : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్‌లని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ని పద్మశ్రీ అవార్డు వరించింది.
బుధవారం రాత్రి పద్మ అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. సంగీతం విభాగంలో కీరవాణికి పద్మశ్రీ అవార్డు దక్కడం విశేషం.. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కీరవాణి సంగీతం అందించిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కి కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ ‘నాటు నాటు’ పాట నామినేట్ కాగా, ఇదే కేటగిరిలో ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా ఈ పాట సొంతం చేసుకుంది.
ఇక ఇదిలా ఉంటే సింగర్ వాణి జయరామ్‌కి పద్మభూషణ్ అవార్డు లభించింది. వివిధ భాషల్లో సుమారు 1000 సినిమాల్లో దాదాపు 10,000 పాటల్ని వాణి జయరామ్ ఆలపించారు.
తొలుత ప్లే బ్యాక్ సింగర్‌గా కెరీర్ మొదలు పెట్టిన వాణి జయరాం.. ఆ తర్వాత సింగర్‌గా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణించారు.. మెలోడీ పాటలు పాడటంలో తన మార్క్ చూపించారు.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టండన్‌కి కూడా పద్మశ్రీ అవార్డు లభించింది.
Also Read:
horoscope : 26-01-2023 , ఈ రాశి వారికి నేడు ఆకస్మిక ధనలాభం
pineapple benefits : పైనాపిల్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తెలిస్తే అస్సలు వదలరు!