1.శీతాకాంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్‌లో జామ పండు ఒకటి. జామపండు తినడం వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి.
2. చలికాలంలో జామపండ్లు తినడం, జామ ఆకులు వాడటం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
3. కాలానుగుణంగా దొరికే పండ్లు తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాటిని మిస్ అయితే ఒంట్లో ప్రొటీన్లు లభించవని చెబుతారు.
4. జామ పండులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.
5. జామ పండు తినడం ద్వారా నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. చిన్న పిల్లలు, పెద్దలు కూడా ఈ పండు తినడానికి ఇష్టపడుతుంటారు.
6. జామ ఆకులతో టీ తయారు చేసుకొని ఆస్వాదించవచ్చు. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలుపుకొని తాగుతారు.
7. జామ ఆకుల టీ సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. షుగర్ లెవల్స్ తగ్గుముఖం పడతాయి.
8. టైప్ 2 డయాబెటిస్ కూడా జామ ఆకులతో చేసిన టీ సేవించడం వల్ల వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
9. మహిళల్లో వచ్చే పీరియడ్స్ సమయంలో జామ ఆకులు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయి.
10. జామ పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. రోజూ ఒక జామపండు తినాలి.
మరిన్ని చదవండి :
Viral Video today : వైకల్యం ఓడిన వేళ.. అతని గుండె ధైర్యానికి సలాం చేయాల్సిందే!
MP Komatireddy Venkat Reddy : కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే చాన్స్.. పార్టీని సిద్ధం చేయండి!