HomecinemaNaresh: ప‌విత్ర‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న న‌రేష్ ప్ర‌తి నెల ర‌మ్య‌కు డ‌బ్బులు పంపుతూనే ఉన్నాడా..!

Naresh: ప‌విత్ర‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్న న‌రేష్ ప్ర‌తి నెల ర‌మ్య‌కు డ‌బ్బులు పంపుతూనే ఉన్నాడా..!

Telugu Flash News

Naresh: టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ న‌రేష్ కొన్నాళ్లుగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. న్యూ ఇయ‌ర్ కి ముందు రోజు ప‌విత్ర‌తో లిప్ లాక్ పెట్టుకుంటూ వీడియో విడుద‌ల చేయ‌డంతో అది సంచ‌ల‌నంగా మారింది. ఈ క్ర‌మంలో రేష్ మూడో భార్య రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్ చేసింది. కృష్ణతో అక్రమ సంబంధం అంటగట్టి నరేష్ ఎన్నో దారుణాలకు ఒడిగట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. నరేష్ నన్ను వదిలించుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎఫైర్స్ అంటగట్టడం తోపాటు, దూషిస్తూ మానసికంగా వేధించార‌ని చెప్పుకొచ్చింది. నరేష్ క్యారెక్టర్ మంచిది కాదని, నా కొడుకు ముందే పోర్న్ వీడియోలు చూసేవాడని దారుణ ఆరోపణలు చేసింది.

ఇక నరేష్ పేరు చెప్పి ఆమె ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు, అప్పులు చేసినట్లు నరేష్ ఆరోపించిన నేపథ్యంలో స్పష్టత ఇచ్చింది . నేను అప్పులు చేసిన విషయం వాస్తవమే. లాక్ డౌన్ కారణంగా నా వ్యాపారం దెబ్బతింది. అందుకు అప్పులు చేయాల్సి వచ్చింది. అయితే నా అప్పుల‌లో ఆయన ఎక్కడా గ్యారెంటర్ గా లేరు.. మా అమ్మగారి ఫ్లాట్ తాకట్టు పెట్టి నేను లోన్ తీసుకున్నాను. ఇక నాపై వచ్చిన ఆర్థిక నేరారోపణలు వెనుక ఆయనున్నారు. ఉద్దేశపూర్వకంగా నరేష్ నన్ను ఇరికించే ప్రయత్నం చేశాడని రమ్య అన్నారు.

న‌రేష్‌ వద్ద ఉన్న వందల కోట్లు కోసమే మీరు ఇదంతా చేస్తున్నారట కదా? అని రిపోర్ట‌ర్ అడగ్గా… నేను ఆయన ఆస్తులు కోరుకోవడం లేదు. భార్యగా ఉండాలనుకుంటున్నాను అంతే. విడాకులు ఇస్తే నరేష్ కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ పలు కథనాలు వస్తున్నాయి. నాకు డబ్బుపై ఆశ ఉంటే అదే చేస్తాను కదా.. అని సమాధానం చెప్పారు. కేవలం కొడుకు కోసమే నేను విడాకులు వద్దనుకుంటున్నాను. మా అబ్బాయి తండ్రి కావాలని కోరుకుంటున్నాడు. వాడి మైంటైనెన్స్ కి కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ఓ మూడేళ్ళ నుండి మాత్రం ఇస్తున్నాడు. అది కూడా నెలకు యాభై వేలు ఇచ్చేవాడు. ప్రస్తుత రూ. 70 వేలు ఇస్తున్నాడు… అని రమ్య రఘుపతి సమాధానం చెప్పారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News